ఆ విషయంలో ‘కార్తీకేయ-2’ను మించిపోయిన ‘స్పై’ - నిఖిల్ కెరీర్లోనే బెస్ట్!
హ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పై' విడుదలై ఫస్ట్ రోజే మంచి రెస్పాన్స్ ను కూడగట్టుకుంది. ఫస్ట్ రోజే గ్లోబల్ గా రూ. 11.7కోట్ల వసూళ్లు రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే ఇది భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం
గత కొంత కాలంగా సౌత్ సినిమాలకి చెందిన చాలా సినిమాలు బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. వీటిలో చాలా వరకు తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రాలే కావడం చెప్పుకోదగ్గ విషయం. తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, చాలా సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన థ్రిల్లర్ చిత్రం 'స్పై' కూడా అలాంటిదే. బక్రీద్ సందర్భంగా జూన్ 29న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన నేషనల్ థ్రిల్లర్ 'స్పై' భారీ అంచనాల నడుమ రిలీజైంది. విడుదలైన ఫస్ట్ డేనే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.11.7 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.
ఈ విషయాన్ని నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సినిమా ప్రారంభ రోజు సాధించిన వసూళ్లు.. నిఖిల్ సినీ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా నమోదు చేసింది. యూఎస్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రాంతీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిఖిల్ మునుపటి చిత్రం 'కార్తికేయ 2' పాన్ ఇండియా విజయం తరువాత, మూవీ టీమ్ ఇటీవల 'స్పై 'ని విస్తృతంగా ప్రమోట్ చేశారు. అది సినిమాకు అత్యధిక కలెక్షన్లు రాబట్టేందుకు సహాయపడింది.
'స్పై' సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న చాలా థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. రాబోయే లాంగ్ వీకెండ్ లో ఈ సినిమా విజయవంతమైన రన్‌కు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
View this post on Instagram
నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ 'స్పై' సినిమా థ్రిల్లర్ గా రూపొందింది. ఈ సినిమాను కె రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు. 'గూడాచారి' (2018), 'ఎవరు' (2019), 'HIT: ది ఫస్ట్ కేస్' (2020), 'పాగల్' (2021), HIT: 'ది సెకండ్ కేస్' (2022) వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ BH ee సినిమాకు దర్శకుడిగా పని చేశారు. అంతే కాదు ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. 'స్పై' చిత్రంలో ఈశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు.
మళ్ళీ మనమే ముందు..
నిఖిల్ సిద్ధార్థ్ సినిమా బడ్జెట్ దాదాపు 45 కోట్లు. అయితే ఈ సినిమా తొలిరోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 'స్పై' మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీల చిత్రం 'సత్యప్రేమ్ కి కహానీ' కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తొలిరోజు ఇండియాలో రూ.9.25 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ సినిమాను 'స్పై' డామినేట్ చేసింది. మరో విశేషమేమిటంటే, నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చిత్రం 'కార్తికేయ-2' తర్వాత, బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ డెబ్యూట్ చేసిన రెండవ చిత్రంగా స్పై నిలిచింది. తాజా అప్‌డేట్‌ల ప్రకారం, స్పై మొదటి రోజు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 11.7 కోట్లకు పైగా (రూ. 6 కోట్ల షేర్) వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలంటే మరో రూ.12 కోట్ల షేర్ రావాలి. లాంగ్ వీకెండ్ హాలిడే అడ్వాంటేజ్‌ని సినిమా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుందా లేదా అనేది అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్‌గా మారుతుందా అనేది వేచి చూడాలి.
Read Also : Charan-Upasana: లిటిల్ మెగా ప్రిన్సెస్ నామకరణ వేడుక వీడియోలు షేర్ చేసిన ఉపాసన - మీరు చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial