Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాజా సాబ్' మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాదులో ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ జాయిన్ అయినట్లు సమాచారం.
Nidhhi Agerwal joins the shoot of The Raja Saab : గత ఏడాది 'సలార్'తో భారీ సక్సెస్ అందుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘డార్లింగ్’లో నటిస్తున్న సినిమాల్లో 'రాజా సాబ్' కూడా ఒకటి. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ కాంబినేషన్ సెట్ అయిందని తెలీగానే మొదట ఎవరు నమ్మలేదు. సినిమాని అఫీషియల్‌గా అనౌన్స్ చేయకుండానే సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేశారు. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ నే కాదు ఆడియన్స్‌కు కూడా సర్ప్రైజ్ చేశారు. ఫస్ట్ లుక్ తోనే మారుతి సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇందులో వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా.. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఎట్టకేలకు రాజా సాబ్ సెట్స్‌లో అడుగుపెట్టింది.
'రాజా సాబ్' షూటింగ్‌లో జాయిన్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ
'రాజా సాబ్' సినిమాకు సంబంధించి మొదట మాళవిక మోహనన్ పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ నిధి అగర్వాల్ సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలిసింది. 'రాజా సాబ్' లేటెస్ట్ షెడ్యూల్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా షూటింగ్ కోసం నిధి అగర్వాల్ తాజాగా హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఎయిర్ పోర్ట్‌లో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతారట. ప్రభాస్, నిధి అగర్వాల్ కాంబినేషన్ సీన్స్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
'రాజా సాబ్' కోసం అలాంటి ప్రయోగం
డైరెక్టర్ మారుతి 'రాజా సాబ్' కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట. సినిమాకి హారర్ టచ్ ఇస్తూనే భారీ గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ లాంటి టెక్నికల్ ఎలిమెంట్స్‌ను జోడించి ఆడియన్స్‌కు ఓ విజువల్ ఫీస్ట్‌ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, సినిమాలో వచ్చే టెక్నికల్ ఎలిమెంట్స్‌కు ఆడియన్స్ థ్రిల్ అవుతారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
'రాజా సాబ్'తో పాన్ ఇండియా ఎంట్రీ
టాలీవుడ్ లో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఇప్పుడు 'రాజా సాబ్' సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే మారుతి కూడా పాన్ ఇండియా దర్శకుల లిస్టులో చేరినట్లే అని చెప్పొచ్చు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read : రజినీకాంత్ మూవీలో శృతిహాసన్ - అలాంటి పాత్రలో ఫస్ట్ టైమ్