Naga Chaitanya: ఇంకా నీ ఇన్‌స్టాలో ఆ ఫోటో ఎందుకు? నాగ చైతన్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
నాగ చైతన్య రీసెంట్ గా శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే, సమంతతో తీసుకున్న ఓ ఫోటో ఇప్పటికీ ఆయన ఇన్ స్టాలో ఉంది. వెంటనే ఆ పిక్ డిలీట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Netizens Fire On Naga Chaitanya: ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కఫుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత తీవ్ర మనస్పర్దలతో విడిపోయారు. వీరిద్దరు విడాకులు తీసుకోవడం పట్ల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అయ్యో అంటూ బాధపడ్డారు. లవ్లీ కఫుల్ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అని మదనపడ్డారు. విడాకుల తర్వాత సుమారు మూడు ఏండ్లకు నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు. నటి శోభితా దూళిపాళ్లతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
ఎంగేజ్ మెంట్ తర్వాత సమంతను అన్ ఫాలో చేసిన నాగ చైతన్య
అటు శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం జరగ్గానే.. నాగ చైతన్య ఇన్ స్టాగ్రామ్ లో సమంతను అన్ ఫాలో చేయడంతో పాటు ఆమెతో పెళ్లి ఫొటోలను కూడా తొలగించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు నాగ చైతన్యను టార్గెట్ చేశారు. ఇన్నిరోజులు ఆయన మంచి వాడిగా నటించాడని కామెంట్స్ చేశారు. శోభితతో నిశ్చితార్థం జరిగిన వెంటనే సమంత ఫోటోలు తొలగించడం, ఆమెను అన్ ఫాలో చేయడం ఆయన కుళ్లు బుద్ధికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ఫోటోను కూడా డిలీట్ చేయండి!
మరోవైపు సామ్‌తో కలిసి తీసుకున్న ఓ ఫోటో ఇప్పటికీ నాగ చైతన్య ఇన్ స్టా గ్రామ్ లో ఉన్నది. నాగ చైతన్య రేస్ ట్రాక్ పై కారు ఆపి సమంతతో ఫోటో తీసుకున్నారు. ఈ పిక్ సెప్టెంబర్ 2018లో నాగ చైతన్య తన ఇన్ స్టాలో పోస్టు చేశారు. దీనికి ‘త్రోబ్యాక్... మిసెస్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. వారిద్దరు కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాలోనిది ఈ ఫోటో. ఈ పిక్ పై సమంత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నువ్వు సమంత ఫొటోలు అన్నీ డిలీట్ చేసి ఆమెను అన్ ఫాలో చేశావు.. ఈ ఫోటోలు ఎందుకు డిలీట్ చేయలేదు?” అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు. మరో అభిమాని ఈ పోస్ట్ డిలీట్ చెయ్ అని కామెంట్ పెట్టాడు. “నీకు సమంత ఫొటోలు పెట్టుకునే అదృష్టం లేదు” అని మరో అభిమాని కామెంట్ పెట్టడం విశేషం.
View this post on Instagram
ప్రేమ.. పెళ్లి.. విడాకులు
అక్కినేని నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘ఏ మాయ చేశావే’ సినిమా సమయంలో ఇద్దరూ కలిసి ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు చక్కగా సంసార జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 2021లో ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. విడాకులకు అసలు కారణం ఇప్పటి వరకు తెలియకపోయినా, నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధపడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ విడాపోవడానికి కారణం శోభిత అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.