అన్వేషించండి

NBK109 Release Date: సంక్రాంతి రేసులో బాలకృష్ణ - చిరు, అజిత్ సినిమాలకు పాటూ...

Balakrishna New Movie: సంక్రాంతి రేసులో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కొత్త సినిమా సైతం చేరిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మరోసారి చిరంజీవితో పాటు ఆయన థియేటర్లలో సందడి చేయనున్నారు.

NBK109 Joins Sankranti 2025 Race: సంక్రాంతి అంటే తెలుగింట పెద్ద పండుగ. తెలుగు ప్రేక్షకులకు సినిమాల పండుగ. ప్రతి ఏడాది సంక్రాంతికి రెండు మూడు భారీ సినిమాలు వస్తాయి. సంక్రాంతికి వచ్చిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమాలు అఖండమైన విజయాలు అందుకున్న సందర్భాలు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి పెద్ద పండక్కి రావాలని నందమూరి నాయకుడు నిర్ణయించినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...  

సంక్రాంతికి బాలకృష్ణ - బాబీ సినిమా విడుదల!?
నట సింహం బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ భారీ సినిమా నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థ నిర్మాణ భాగస్వామి. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. కానీ, సంక్రాంతి రిలీజ్ అని మూవీ టీం ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ నెలాఖరుకు కంప్లీట్ కావచ్చని టాక్. తొలుత డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసినా... ఆ సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావడం కష్టం అని, అందుకే సంక్రాంతి బరికి సినిమా షిఫ్ట్ అయ్యిందని టాక్. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో సందడి చేయనుంది.

Also Read: బాలకృష్ణ సినిమా తర్వాత రవితేజతో... అసలు నిజం ఏమిటంటే?


సంక్రాంతి బరిలో ఇంకెవరు ఉన్నారు?
Sankranti 2025 Telugu Movies: రాబోయే సంక్రాంతి మీద మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కర్చీఫ్ వేశారు. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'విశ్వంభర' సినిమా (Vishwambhara Movie)ను జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

తమిళ కథానాయకుడు అజిత్, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో తెరకెక్కుతున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ని సైతం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ రెండు సినిమాలతో పాటు బాలకృష్ణ సినిమా రావడం కూడా ఖాయమే.

Also Readఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?

బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాబీ తీసిన లాస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య'. అందులో చిరంజీవి హీరో. ఆ సినిమా సంక్రాంతికి విడుదల కాగా... భారీ విజయం సాధించింది. ఆ ఏడాది పండుగ బరిలో విజయం సాధించిన మరో సినిమా 'వీర సింహా రెడ్డి'. అందులో హీరో బాలకృష్ణ. ఇప్పుడు బాలయ్య, బాబీ కలిసి చేస్తున్న సినిమా సైతం సంక్రాంతికి వస్తుండటం విశేషం. సంక్రాంతి సీజన్ టార్గెట్ చేస్తూ రెండు హిందీ సినిమాలు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయట.

Also Readసూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరొక హీరో - అన్నయ్య కొడుక్కి అండగా మహేష్!

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget