News
News
వీడియోలు ఆటలు
X

NBK108 Update : హై ఎనర్జిటిక్ సాంగ్, గ్రాండ్ సెట్, బాలకృష్ణతో బాస్

నందమూరి బాలకృష్ణ మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అనిల్ రావిపూడి ఓ భారీ పాటను తెరకెక్కించారు.

FOLLOW US: 
Share:

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా (NBK 108 Movie) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఓ పాటను పూర్తి చేశారు. 

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో...
NBK 108 Wraps Up Song Shoot : బాలకృష్ణతో హై ఎనర్జిటిక్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశామని ఎన్.బి.కె సి 108 చిత్ర బృందం పేర్కొంది. గ్రాండ్ సెట్ కూడా వేశామని తెలిపారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ (Sekhar Master) కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో శ్రీలీల కూడా ఉన్నట్టు టాక్. ఈ సాంగ్ కోసం ఐదు కోట్ల రూపాయల సెట్ వేశారట. 

Also Read 'రావణాసుర' రివ్యూ : రవితేజ సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట. 

బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు!
Sreeleela Balakrishna Relation In NBK 108 : ఎన్.బి.కె 108లో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె బాలకృష్ణ కుమార్తె పాత్ర చేస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీలీలకు బాబాయ్ పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. మరి, శ్రీలీల తండ్రి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అంటే... శరత్ కుమార్! ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో ఆయన నటిస్తున్నారు.

బాలకృష్ణ హీరోగా డిఫరెంట్ యాక్షన్ డ్రామాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దూకుడైన మనస్తత్వం కల హీరోగా బాలకృష్ణ క్యారెక్టర్ డిజైన్ చేశారట. శ్రీలీల, శరత్ కుమార్, హీరో మధ్య సీన్లు కొత్తగా ఉంటాయని తెలిసింది. సినిమాకు ఆ సీన్లు ఆయువు పట్టు లాంటివి అని తెలిసింది. ఇటీవల బాలకృష్ణ, శ్రీలీల, ఇతర తారాగణం పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.

దసరా బరిలో బాలకృష్ణ సినిమా!
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మీ కళ్యాణం'తో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది.

Also Read : వాళ్ళిద్దరూ మళ్ళీ జంటగా దొరికేశారు

Published at : 07 Apr 2023 03:51 PM (IST) Tags: Nandamuri Balakrishna Sreeleela NBK108 Update Energetic Song

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !