Nayanthara: పళని టెంపుల్‌లో నయనతార విత్ ఫ్యామిలీ - ఆ రూమర్లకు చెక్ పెట్టేశారుగా...
Nayanthara Vignesh Shivan: నయనతార, విఘ్నేష్ దంపతులు తమిళనాడులోని ప్రముఖ పళని ఆలయాన్ని సందర్శించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Nayanthara Vignesh Shivan Visit Palani Swamy Temple: స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలిసి ప్రముఖ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేష్, నయన్ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కనిపించారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు షేర్ చేస్తున్నారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఈ పళని టెంపుల్ చాలా ఫేమస్. పలువురు కోలీవుడ్ హీరోలు ఈ ఆలయానికి తరచూ వెళ్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తాజాగా... నయనతార తన ఫ్యామిలీతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆమె తరచూ తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వెళ్తుంటారు.
ఆ రూమర్లకు చెక్...
ఇటీవల సోషల్ మీడియా వేదికగా నయన్, విఘ్నేష్ కపుల్ డివోర్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. నయనతార ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ చేసి డిలీట్ చేశారని ఆమె విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఇన్ స్టా స్టోరీలో... 'తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మ్యారేజ్ పెద్ద తప్పవుతుంది. భర్త చేసే పనులకు భార్య బాధ్యత ఎందుకు వహించాలి. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను చాలా అనుభవించాను.' అని పోస్ట్ చేశారని.. అయితే క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేశారనే ప్రచారం సాగింది. అదంతా ఫేక్ అని ఎవరో కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. అయినా ప్రచారం ఆగలేదు. 
ఆ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారగా... తన భర్త విఘ్నేష్‌తో కలిసి టెంపుల్‌కు వెళ్లిన నయన్ ఆ రూమర్లకు ఫుల్ చెక్ పెట్టేశారు. ఇద్దరూ కలిసి పళని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి పిల్లలతో కలిసి సంతోషంగా కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలు షేర్ చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు.
Also Read: బాలీవుడ్ స్టార్స్... 10 వేల మంది యాక్టర్స్, టెక్నీషియన్స్ - విజువల్ వండర్ 'రామాయణ'
ఓవైపు తెలుగు, మరోవైపు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు నయనతారు. తమిళ మూవీ 'చంద్రముఖి' (తెలుగు డబ్బింగ్)తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత వెంకీ 'లక్ష్మీ' మూవీలో తన నటనతో మెప్పించారు. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. రీసెంట్‌గా నయన్ నటించిన 'టెస్ట్' మూవీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే... 'మూకుత్తి అమ్మన్' (తెలుగులో అమ్మోరు తల్లి) సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ సి.సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే... యశ్ హీరోగా నటిస్తోన్న 'టాక్సిక్' మూవీలోనూ నయన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ మరో హీరోయిన్ కాగా మలయాళ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు.






















