Ramayana Movie: బాలీవుడ్ స్టార్స్... 10 వేల మంది యాక్టర్స్, టెక్నీషియన్స్ - విజువల్ వండర్ 'రామాయణ'
Ramayana Roles List: మహా ఇతిహాసం 'రామాయణ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ కోసం ఏకంగా 10 వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ పని చేసినట్లు తెలుస్తోంది. కీలక రోల్స్ ఓసారి చూస్తే...

Nitesh Tiwari's Ramayana Mythological Roles Full List: నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న 'రామాయణ' గ్లింప్స్ ట్రెండ్ సృష్టిస్తోంది. 'రామాయణం మన వాస్తవం... మన చరిత్ర' అనే ట్యాగ్, విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. దాదాపు రూ.1600 కోట్ల భారీ బడ్జెట్‌తో 2 పార్టులుగా మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
'రామాయణ'లో ప్రతీ రోల్ ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే నితేశ్ భారీగా ప్లాన్ చేశారు. సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు బాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించారు. ఎవరెవరు ఏ రోల్ చేస్తున్నారో ఓసారి చూస్తే...
కీ రోల్స్... స్టార్స్
- రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ చేయనున్నారు. విష్ణుమూర్తి అవతారంగా రామున్ని భక్తులు విశ్వసిస్తారు. ధర్మం, నీతి, శౌర్యం ఆయన గుణాలు. మానవ రూపంలో ఉన్న దేవుడు మన రాముడు.
- సీతా దేవిగా సాయిపల్లవి నటిస్తున్నారు. రాముని భార్యగా భర్త కష్టాలను పాలు పంచుకున్న సీతామాతగా ఆమె కనిపించనున్నారు.
- ఇక రావణాసురుడిగా పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్నారు. అద్భుతమైన తెలివితేటలు,, వేదాలు, పాండిత్యానికి పేరు గాంచిన రావణుడు... సీతను అపహరించడంతో మహా యుద్ధానికి కారణమవుతుంది.
- రావణుడి భార్య 'మండోదరి' పాత్రలో కాజల్ అగర్వాల్ నటించనున్నారు. రావణుడు సీతను అపహరిస్తే అతన్ని హెచ్చరించి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించి విఫలమైంది.
- లక్ష్మణుడిగా ప్రముఖ టీవీ యాక్టర్ రవి దూబే కీలక పాత్ర పోషిస్తున్నారు. 14 ఏళ్ల వనవాసం సమయంలో సీతారాములతో పాటు ఉండి భక్తితో వారికి అండగా నిలిచారు.
- రామాయణంలో కీలక రోల్ రామునికి నమ్మిన బంటు హనుమంతుడు. ఈ రోల్‌ను బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ పోషించనున్నారు.
- ప్రముఖ నటి ఇందిరా కృష్ణన్ రాముని తల్లి, దశరథుని భార్య రాణి 'కౌశల్య'గా కనిపించనున్నారు.
- రామాయణ ఇతిహాసానికి కీలక ట్విస్ట్ అయిన రోల్ కైకేయి. దశరథుని మూడో భార్య, కైకేయి పాత్రలో 'లారా దత్తా' నటించనున్నట్లు తెలుస్తోంది. తన పనిమనిషి మంధర మాటలతో ప్రభావమైన కైకేయి దశరథుడు తనకిచ్చిన మాటతో రాముడు వనవాసానికి వెళ్లేలా చేస్తుంది.
- రామాయణంలో సీతను అపహరించేందుకు కారణమైన ప్రధాన పాత్ర 'శూర్ఫణఖ'. ఈ రోల్‌ను రకుల్ ప్రీత్ సింగ్ పోషించనున్నారు. రాముడి వనవాసం సమయంలో శూర్పణఖ రాముడిని చూసి వ్యామోహం పెంచుకుని అతన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తుంది. రాముడి తిరస్కరించగా సీతపై దాడికి యత్నించడంతో లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు.
- శూర్ఫణఖ భర్త 'విద్యుత్జిహ్వ'. మూవీలో ఈ రోల్‌ను వివేక్ ఒబెరాయ్ పోషించనున్నారు. కల్కేయ వంశానికి చెందిన దానవ యువరాజు విద్యుత్జిహ్వుడి వివాహాన్ని ద్రోహంగా భావించి రావణుడు చంపాడు.
- కైకేయి పని మనిషి మంధర పాత్రను 'షీబా చద్దా రాణి' పోషించనున్నారు. రాముడు వనవాసం చేసేలా భరతుని తల్లి కైకేయి దశరథున్ని వరం అడిగేలా ఈమె రెచ్చగొడుతుంది.
Also Read: 'AIR' వెబ్ సిరీస్ కాంట్రవర్శీకి చెక్ - ఆ సీన్స్ డిలీట్... వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు
10 వేల మంది టెక్నీషియన్స్
ఈ మూవీకి సంబంధించి నితేశ్ తివారీ బృందం మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఏకంగా 10 వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ పని చేసినట్లు తెలిపింది. 'రామాయణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఒక్క వేదికపైకి తీసుకొచ్చింది. 'అవతార్', 'డ్యూన్' సినిమాలకు పని చేసిన వారి కంటే రెండింతల మంది ఈ దృశ్యకావ్యంలో భాగస్వాములయ్యారు.' అంటూ 'X' వేదికగా పేర్కొంది.
రెండు భాగాలుగా 'రామాయణ' మూవీ రానుండగా... ఫస్ట్ పార్ట్‌ను 2026 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.





















