Nayanthara-Vignesh Shivan: ‘ప్రేమలు’, ‘ఆవేశం’ సినిమాలపై స్పందించిన నయన్, విఘ్నేష్ దంపతులు - ఏమన్నారంటే?
మలయాళీ సినిమాలు ‘ఆవేశం’, ‘ప్రేమలు’పై స్టార్ కపుల్స్ నయనతార, విఘ్నేష్ శివన్ ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాల గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Nayanthara Vignesh Shivan Are Fans of Aavesham And Premalu: ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన పలు సినిమాలు అద్భుత విజయాలను అందుకుంటున్నాయి. 2024 ప్రారంభం నుంచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ధూమ్ ధామ్ చేస్తున్నాయి. ‘భ్రమయుగం’, ‘ప్రేమలు’, ‘మంజుమ్మల్ బాయ్స్’తో పాటు ‘ఆవేశం’లాంటి సినిమాలు వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగిస్తున్నాయి. తాజాగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్, రీసెంట్ గా విడుదలై అద్భుత విజయం అందుకున్న మలయాళీ సినిమాలపై ప్రశంసల జల్లు కురిపించారు. 'ప్రేమలు', 'ఆవేశం' చిత్రాలను చూసిన తర్వాత తమ ఆనందాన్ని వెల్లడించారు. నయనతార 'ప్రేమలు' సినిమా అద్భుతంగా ఉందని చెప్పగా, విఘ్నేష్ ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' గురించి సూపర్ రివ్యూ ఇచ్చారు.
‘ప్రేమలు’, ‘ఆవేశం’ గురించి స్టార్ కపుల్స్ ఏమన్నారంటే?
‘ప్రేమలు’ సినిమా గురించి ఇన్ స్టా వేదికగా స్పందించిన నయనతార, మూవీకి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేసింది. “ఇలాంటి మంచి సినిమాలు చాలా సంతోషపరుస్తాయి” అని కామెంట్ చేసింది. అటు విఘ్నేష్ 'ఆవేశం' సినిమా రివ్యూ ఇచ్చారు. "అత్యద్భుతమైన సినిమాను చూసి ఉలిక్కిపడ్డాను. ఈ చిత్రాన్ని మేకర్స్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు” అని రాసుకొచ్చారు. ఫహద్ ఫాసిల్ తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ప్రేమలు’
మలయాళంలో ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల అయ్యింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదుర్స్ అనిపించింది. తెలుగులోనూ ఈ సినిమా ‘ప్రేమలు’ పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. నిజానికి ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. గిరీష్ ఏడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. చక్కటి కామెడీతో ప్రేక్షకులను నవ్వించింది. ఈ సినిమాలో నస్లెన్ కె ఫఫూర్, మమితా బైజా ప్రధాన పాత్రలు పోషించారు. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం ఇతర పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఆవేశం’
ఇక ఫహద్ ఫాసిల్ నటించిన తాజా చిత్రం ‘ఆవేశం’. ఆయన సొంత బ్యానర్‌లో భార్య నజ్రియా నజీమ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేరళ నుంచి ఉన్నత విద్యను చదివేందుకు బెంగళూరు వెళ్లిన ఓ యువకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనే సింగిల్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, మన్సూర్ అలీ ఖాన్, సజిన్ గోపు కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గగ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
Read Also: నెటిజన్స్ చెవిలో పువ్వులు పెట్టిన నభా నటేష్, ప్రియదర్శి - వారి గొడవ అందుకేనట!