Nayanthara First Marriage Photo: నయనతార, విఘ్నేష్ పెళ్లి ఫొటో వచ్చేసింది, ఇదిగో చూసేయండి
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ రోజు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి ఫొటోను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు.
నయనతార (Nayanthara)కి వివాహమైంది. ఇకపై ఆమె కుమారి కాదు, శ్రీమతి! కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)తో ఈ రోజు ఏడు అడుగులు వేశారు. పెళ్లి ఫొటోను విఘ్నేష్ ట్వీట్ చేశారు.
On a scale of 10…
— Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022
She’s Nayan & am the One ☝️☺️😍🥰
With God’s grace , the universe , all the blessings of our parents & best of friends
Jus married #Nayanthara ☺️😍🥰 #WikkiNayan #wikkinayanwedding pic.twitter.com/C7ySe17i8F
హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ - విఘ్నేష్ పెళ్లి జరిగింది. తాళి కట్టిన తర్వాత నయనతార నుదుటిపై విఘ్నేష్ ముద్దు పెట్టారు. ఆ ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.
Also Read: రజనీకాంత్ నుంచి షారుఖ్ ఖాన్ వరకూ... నయనతార పెళ్లికి అటెండ్ అయిన స్టార్స్ ఎవరో చూడండి
''పది మార్కులు ఇవ్వాలంటే... తనకు నయన్ (తొమ్మిది), నాకు ఒకటి. భగవంతుడి దయతో... ఈ విశ్వం, మా తల్లిదండ్రులు, స్నేహితుల ఆశీర్వాదాలతో... పెళ్లి చేసుకున్నాం'' అని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. జస్ట్ మ్యారీడ్ హ్యాష్ ట్యాగ్ జోడించారు. పలువురు ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
జూన్ 11న... ఈ శనివారం చెన్నైలో నయనతార - విఘ్నేష్ శివన్ దంపతులు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది వస్తారని ఒక అంచనా. అంత మందికి ఆహ్వానాలు వెళ్లాయని తెలుస్తోంది.
Also Read: పెళ్లయిన వారానికి తల్లిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నయనతార
View this post on Instagram