Nayanthara: మెగాస్టార్ సినిమాకు డిస్కౌంట్... నయన్ రెమ్యూనరేషన్‌లో భారీ కటింగ్!
Chiranjeevi Anil Ravipudi Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలో నయనతార నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆవిడ తన కండిషన్స్ పక్కన పెట్టిందట.

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న ఇంపార్టెన్స్ హీరోయిన్లకు ఉండదని చాలా మంది చెప్పే మాట. హీరోల మాట చెల్లుబాటు అయినట్టుగా హీరోయిన్ల మాట చెల్లుబాటు కాదని అంటుంటారు. అయితే హీరోలకు ధీటుగా, హీరోలతో సమానంగా తన మాట చెల్లుబాటు అయ్యేలా చూసుకున్న హీరోయిన్ నయనతార. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం తన కండిషన్స్ పక్కన పెట్టిందట.
మెగాస్టార్ సినిమాకు నయన్ డిస్కౌంట్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. ఇందులో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)ను తీసుకున్నారు. అది కూడా తెలిసిన విషయమే.
సినిమాకు సంతకం చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టే అలవాటు నయనతారకు ఉంది. అందులో ముఖ్యమైనది పబ్లిసిటీ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలకు హాజరు కావడం కుదరదని ఖరాకండీగా చెబుతుంది. అయితే మెగాస్టార్ సినిమా కోసం ఆ విషయంలో నయనతార డిస్కౌంట్ ఇచ్చింది. ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని వీడియో ద్వారా చెప్పింది. ఇటీవల చెన్నై వెళ్లిన అనిల్ రావిపూడి... నయన్ మీద స్పెషల్ వీడియో షూట్ చేసుకుని వచ్చారు. దీన్ని బట్టి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో కూడా ఆవిడ పాల్గొనే అవకాశం ఉందని అర్థం అవుతోంది.
నయన్ రెమ్యూనరేషన్‌లో కొంత కటింగ్!
చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార 18 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఆ మధ్య వార్తల్లో వినిపించింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నయన్ రికార్డ్ క్రియేట్ చేశారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సరసన నటించిన 'జవాన్'తో ఆవిడ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ సినిమా భారీ విజయం సాధించింది. దాంతో రెమ్యూనరేషన్ పరంగా నయన్ ఒక్క మెట్టు కూడా కిందకు దిగే అవకాశం ఉండదని అందరూ భావించారు. అయితే 18 కోట్ల కాకుండా చిరంజీవి సినిమా కోసం కేవలం 6 కోట్ల రూపాయలు తీసుకోవడానికి లేడీ సూపర్ స్టార్ ఎస్ చెప్పిందట. చిరు సినిమా కోసం ఆవిడ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read: యాంగ్రీ మ్యాన్‌తో విజయ్ దేవరకొండ 'ఢీ'... యంగ్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్... విలన్ రోల్ కన్ఫర్మ్
నయనతార నటించిన లాస్ట్ తెలుగు సినిమా కూడా చిరంజీవిది కావడం గమనార్హం. 'గాడ్ ఫాదర్' సినిమాలో ఆవిడ సిస్టర్ రోల్ చేశారు. అంతకు ముందు హిస్టారికల్ వార్ డ్రామా 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో హీరోయిన్ రోల్ చేశారు. చిరంజీవి నయనతార కలయికలో ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోయేది మూడో సినిమా. 'విశ్వంభర' చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావడంతో వేసవి తర్వాత ఈ సినిమాను పట్టాలు ఎక్కించడానికి చిరంజీవి రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.
Also Read: పాపం నితిన్... దేవరకొండ కోసం త్యాగం చేయక తప్పలేదు... తమ్ముడిని వెనక్కి పంపిన 'దిల్' రాజు





















