Nayanthara: సంక్రాంతికి రఫ్పాడించేద్దాం - మెగాస్టార్, అనిల్ మూవీలో నయనతార కన్ఫర్మ్.. వెరైటీ అనౌన్స్‌మెంట్ వీడియో చూశారా!
Mega157 Movie Updates: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతార చేయనున్నట్లు టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

Nayanthara Joining In Chiranjeevi Anil Ravipudi Mega157 Movie: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు. ఈ ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బిగ్ అప్ డేట్ వచ్చేసింది
అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అనే ఉత్కంఠకు తెర పడింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించనున్నట్లు మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వేదికగా స్పెషల్ వీడియోతో నయన్‌కు టీం వెల్ కం చెప్పింది. 'మా మెగాస్టార్‌తో తన అందం, తేజస్సును తీసుకువస్తున్న నయనతార. మా మెగా 157 ప్రయాణానికి వెల్ కం చెబుతున్నాం.' అంటూ పేర్కొంది.
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం..
ఈ సందర్భంగా నయనతారపై టీం చేసిన వీడియో అదిరిపోయింది. ఆమె మేకప్ రూంలో మేకప్ చేస్తుండగా తెలుగులో మాట్లాడతారు. ఇంతలో అసిస్టెంట్ వచ్చి మేడమ్.. 'తెలుగులో మాట్లాడుతున్నారు.. తెలుగు సినిమా చేస్తున్నందుకా?' అని ప్రశ్నిస్తుంది. కారులో మెగాస్టార్ పాట ప్లే అవుతుండగా.. 'అన్నా.. చిరంజీవి గారి పాట.. కొంచెం సౌండ్ పెంచు అంటూ నయన్ చెబుతారు'. మేడమ్ చిరంజీవి గారితో చేస్తున్నారా? అని డ్రైవర్ ప్రశ్నించగా అవునని చెెబుతారు నయనతార.
ఇక ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చి చిరంజీవి స్టైల్‌లో.. 'హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా.' అంటూ డైలాగ్ చెప్పగా.. అనిల్ రావిపూడి, నయనతార.. ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చి చిరు స్టైల్‌లో 'సంక్రాంతికి రఫ్పాడించేద్దాం' అంటూ చెప్పడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Welcome back for the hatrick film #Nayanthara!
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 17, 2025
Glad to have you on board for our #Mega157 journey with @anilravipudi.
SANKRANTHI 2026 రఫ్ఫాడించేద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt https://t.co/2faZXKNYaq
Also Read: రాజమౌళి వర్సెస్ ఆమిర్ ఖాన్ - దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా..
ముచ్చటగా మూడోసారి..
సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ తర్వాత మూడోసారి నయనతార చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో చిరు.. తన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ పేరుతో కనిపిస్తారనే ఇదివరకే అనిల్ రావిపూడి ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉందని.. ఓ రోల్ కోసం అదితిరావు హైదరిని టీం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు.





















