అన్వేషించండి

Eleven Teaser: ఎలుకను తిన్న పాముకు తెలియదు.. దాన్ని తినడానికి గద్ద వస్తుందని - ఉత్కంఠగా సాగిన నవీన్‌ చంద్ర ఎలెవెన్‌ టీజర్‌

Eleven Telugu Teaser: నవీన్‌ చంద్ర నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ఎలెవెన్‌. తమిళ, తెలుగులో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ రిలీజ్‌ చేశారు.

Eleven Telugu Teaser: ఈ మధ్య హీరో నవీన్‌ చంద్ర వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాడు. ఇటీవల 'ఇన్‌స్పెక్టర్‌ రిషి' అంటూ ఓ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రియులను పలకరించాడు. రీసెంట్‌గా కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'సత్యాభామ' చిత్రంలో కీ రోల్‌ పోషించాడు. అలాగే ఆయన ప్రధాన పాత్రలో బైలింగువల్‌ మూవీగా 'ఎలెవెన్‌' రాబోతుంది. క్రైం మిస్టరి థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

ఈ నేపథ్యంలో తాజాగా 'ఎలెవెన్‌' నుంచి మేకర్స్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఓ కేసు విషయమై హీరో ఇన్వెస్ట్‌గేట్‌ చేస్తూ సాగిన ఈ టీజర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. "రంజిత్ లాంటి ప్రతిభ ఉన్న పోలీసు ఆఫీసరే ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోయారో ఇప్పుడు అర్థమవుతుంది.. ఫింగర్‌ ప్రింట్స్‌ లేవు, సీసీటీవీ ఫుటేజ్‌ లేదు.. కనీసం జుట్టు ఆనవాళ్లు కూడా లేవు" అని నవీన్‌ చంద్ర చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌ ఓ కేసును సీరియస్‌గా తీసుకుని ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నట్టుగా కనిపించారు. అసలు ఎలాంటి ఆధారాలు లేని ఓ కేసును ఛేదించడమే ఎలెవెన్ మూవీ కథ అని టీజర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది.

ఇక టీజర్‌ మధ్యలో 'ఎలుకను తిన్న పాముకు తెలియదు.. దాన్ని తినడానికి గద్ద ఒకటి వస్తుంది' అనే నవీన్‌ చంద్ర చెప్పే డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. ఈ డైలాగ్‌ నిందితులను ఉద్దేశించిన చెప్పినట్టుగా ఉంది. ఆధారాలు లేని ఓ క్రైం ఇన్వెస్టిగేషన్ చూట్టూ సాగిన టీజర్ ప్రతి క్షణంగా ఉత్కంఠ పెంచింది. ఇక మధ్య మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆకట్టుకున్నాయి. దాదాపు 1:43 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా సాగింది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా నవీన్‌ చంద్ర‌ మరోసారి తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కాగా తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ అజ్లిస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రేయా హరి, శశాంక్‌ అభిరామి, దిలీపన్‌ వంటి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read: జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు - షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
C M Nandini: బెంగళూరులో సీరియల్ నటి నందిని ఆత్మహత్య - ఆమె డైరీలో ఉన్న వాటితో సినిమానే తీయవచ్చు !
బెంగళూరులో సీరియల్ నటి నందిని ఆత్మహత్య - ఆమె డైరీలో ఉన్న వాటితో సినిమానే తీయవచ్చు !
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
Embed widget