Janhvi Kapoor: జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు - షాక్ అవుతున్న ఫ్యాన్స్
Janhvi Kapoor: జాన్వీ కపూర్ మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆమె సోషల్ మీడియాలో ఖాతాలో అసభ్యకరమైన పోస్ట్స్ దర్శనం ఇచ్చాయి. ఇవి చూసి ఫ్యాన్స్, నెటిజన్లంతా షాక్ అవుతున్నారు.
![Janhvi Kapoor: జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు - షాక్ అవుతున్న ఫ్యాన్స్ Janhvi Kapoor Team Clarifies About Absence Photos in Twitter Janhvi Kapoor: జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు - షాక్ అవుతున్న ఫ్యాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/c6b3fbd7e73650a4f2230827da5393e81718799762154929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Absence Photos in Janhvi Kapoor Social Media: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ధడక్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక హీరోయిన్‌గా ఎంత బిజీ ఉన్న జాన్వీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. అయితే, జాన్వీ సోషల్ మీడియాలో అకౌంట్లో తరచూ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు దర్శనం ఇస్తుంటాయి. ఆ మధ్య జాన్వీ సోషల్ మీడియా ఖాతాలో అభ్యంతరకమైన పోస్ట్స్ కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పట్లో ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. జాన్వీ ఎంటీ ఇలాంటి ఫోటోలు షేర్ చేసిందంటూ అంతా చర్చించుకున్నారు. తాజాగా మరోసారి జాన్వీ సోషల్ మీడియాలో ఖాతాలో అలాంటి పోస్ట్స్ దర్శనం ఇచ్చాయి.
జాన్వీ రీపోస్ట్ పేరుతో తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో గత కొద్ది రోజులుగా అసభ్యకరమైన ట్వీట్స్ వస్తున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఆమెకు ఏమైంది.. ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తుందంటూ షాక్ అవుతున్నారు. తాజాగా దీనిపై జాన్వీ టీం స్పందించింది. అసలు జాన్వీ కపూర్‌కి ట్విటర్ ఖాతానే లేదని స్పష్టం చేఇంది. ఆమె పేరుపై ఉన్న ట్విటర్ అకౌంట్స్ అన్ని ఫేక్ అని, అవేవి ఫాలోకావద్దని సూచించారు. ఈ ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె టీం హెచ్చరించింది. ఇది తెలిసి ఆమె ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ సందడి మామూలుగా ఉండదు.
గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడని ఈ భామ తరచూ పోట్టి పోట్టి బట్టల్లో హాట్ షో చేస్తుంది. చీరలో హోయలు పోతూ.. షార్ట్ డ్రెస్‌లో థైస్ షో చేస్తూ.. ఇలా నెట్టింట హీట్ పెంచుతుంది. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో ఖాతాలో ఇలాంటి అభ్యంతరకరమైన ఫోటోలు వీడియోలు వస్తున్నాయంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేవరతో బిజీగా ఉన్న ఈ భామ ఈ సినిమా సెట్‌లో ఉండగానే.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది. అదే డైరెక్టర్ బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్‌సీ 16(RC 16). ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది.
View this post on Instagram
Also Read: ఆఫీషియల్, 'కల్కి 2898 AD'లో నటి శోభన - ఆమె పాత్ర ఇదే, ఆకట్టుకుంటున్న లుక్ పోస్టర్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)