National Film Awards 2023 : తగ్గేదే లే - తెలుగులో డైలాగ్ చెప్పిన బన్నీ, 'ఉప్పెన' దర్శకుడూ...
Allu Arjun At National Film Awards 2023 : జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమం మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు చిత్రసీమ సగర్వంగా తలెత్తి నిలబడింది.
జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం మొదలైంది. మన దేశ రాజధాని ఢిల్లీలో పురస్కార విజేతల సందడి మొదలైంది. ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సగర్వంగా తలెత్తి నిలబడింది. నేషనల్ లైవ్ సాక్షిగా మన మాతృభాష తెలుగులో సినీ ప్రముఖులు మాట్లాడటం తెలుగు ప్రజలకు కాలర్ ఎగరేసే మూమెంట్ అని చెప్పాలి.
తగ్గేదే లే - తెలుగులో డైలాగ్ చెప్పిన బన్నీ
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ కథానాయకుడిగా 'పుష్ప : ది రైజ్' సినిమాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నిలిచారు. తనకు అవార్డు రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉందని జాతీయ మీడియాతో ఆయన తెలిపారు. కమర్షియల్ సినిమాకు అవార్డు రావడం వ్యక్తగతంగా తనకు డబుల్ అచీవ్‌మెంట్ అని బన్నీ పేరొన్నారు. 'పుష్ప' సినిమాలో సిగ్నేచర్ డైలాగ్ చెప్పమని ఆయన్ను అడగ్గా... ''నా మాతృభాషలో చెప్పడం నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది'' అంటూ ''తగ్గేదే లే'' అని చెప్పారు.
Also Read : రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్
NATIONAL AWARD WINNING BEST ACTOR Icon Star @alluarjun shares his excitement ahead of the Presentation Ceremony of '69th National Film Awards' ❤️🔥❤️🔥#Pushpa @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/lMXf77JrWL
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2023
'పుష్ప' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఆ సంస్థ నిర్మించిన 'ఉప్పెన' ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకుంది. దర్శకుడు సానా బుచ్చిబాబు (Buchi Babu Sana)తో పాటు నిర్మాత నవీన్ యెర్నేని, రవిశంకర్ సైతం అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. జాతీయ మీడియాలో బుచ్చి బాబు కూడా తెలుగులో మాట్లాడారు.
National award winning #Uppena movie producer #NaveenYerneni garu & director @BuchiBabuSana share their excitement ahead of the presentation ceremony of 69th National Film Awards 💥💥 pic.twitter.com/ggIAWx4eiU
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2023
అల్లు అర్జున్, రాజమౌళితో అభిషేక్ సెల్ఫీ
'పుష్ప' సినిమాకు గాను అల్లు అర్జున్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్... ఇద్దరికీ అవార్డులు రాగా, 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు ఆరు అవార్డులు వచ్చాయి. ఆ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం ఢిల్లీ వెళ్లారు. దర్శక ధీరుడు, బన్నీతో పాటు నిర్మాత అభిషేక్ అగర్వాల్ సెల్ఫీ దిగారు.
Also Read : 'మ్యాన్షన్ 24' రివ్యూ : హాట్‌స్టార్‌లో ఓంకార్ వెబ్ సిరీస్ - భయపెట్టిందా? లేదా?
దసరాకు విడుదల అవుతున్న రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'ను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ హైదరాబాదీ నిర్మాత తీసిన హిందీ సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'కు ఉత్తమ జాతీయ సమగ్రతా సినిమాగా అవార్డు వచ్చిన విషయం విదితమే. అదీ సంగతి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial