అన్వేషించండి

Veeranjaneyulu Viharayathra: ఆ చెంబులో బ్రహ్మానందం, ‘వీరాంజనేయుల విహారయాత్ర’ టీజర్ చూస్తే పడీపడీ నవ్వాల్సిందే!

సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ టీజర్ విడుదల చేశారు.

Veeranjaneyulu Viharayathra Teaser: సీనియర్ నటుడు నరేష్ ముఖ్యపాత్రలో నటించిన  తాజా మూవీ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. శ్రీలక్ష్మి, ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కుటుంబమంతా కలిసి చేసే ఓ విహార యాత్ర చుట్టూ తిరిగే కథనంతో ఈ సినిమా తెరకెక్కించింది.

ఫుల్ ఫన్నీగా ‘వీరాంజనేయుల విహారయాత్ర’ టీజర్

ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ లో నరేష్ కామెడీ టైమింగ్‌, డైలాగ్స్‌ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తిగా అస్థికల చెంబు చుట్టూనే తిరుగుతూ ఫుల్ కామెడీని అందిస్తోంది. ఈ చెంబుకు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ అస్తికలను గోవాలో కలిపేందుకు వెళ్లే క్రమంలో వీరాంజనేయులు ఫ్యామిలీకి ఎలాంటి ఫన్నీ సంఘటనలు ఎదురయ్యాయి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

నిజానికి ఈ సినిమాలో వీరాంజనేయులు(నరేష్) కుటుంబ సభ్యులు ఒక విషయంపై తలా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ అందరూ ఏకతాటి మీద నిలడబడరు. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్లాలని భావిస్తారు. ఈ టూర్ కు తమ పూర్వీకుల పాత కారులో వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మూలకు పడిన ఆ పాత వ్యాన్ కు అవసరమైన మరమ్మతులు చేసి కొత్త పెయింట్ వేసి గోవాకు ప్రయాణం మొదలు పెడతారు. వారు గోవాకు వెళ్లే సమయంలో అస్థికల చెంబు కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేవి సినిమాలో చూపించనున్నారు.

‘వీరాంజనేయులు విహార యాత్ర’ మాంచి సక్సెస్ అందుకునేనా?

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’ చిత్రాన్ని నిర్మించిన బి బాపినీడు,  సుధీర్ ‘వీరాంజనేయులు విహార యాత్ర’ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై తొలి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ‘భామాకలాపం’ మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి ఆదరణ దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

Also Read: విమానంలో సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం, నెట్టింట వీడియో వైరల్- నిజంగానే జరిగిందా? కావాలని చేశారా?

Also Read: ఇండియాలో ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్‌’కు సూపర్ క్రేజ్ - ప్రీ బుకింగ్స్ విషయంలో సినిమా రికార్డ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget