By: ABP Desam | Updated at : 08 Apr 2023 11:38 AM (IST)
'మళ్ళీ పెళ్లి' సినిమాలో పవిత్ర, నరేష్
నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Telugu Movie 2023). చిత్ర పరిశ్రమలో నటుడిగా నరేష్ 50 వసంతాలు పూర్తైన సందర్భంలో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
ఎంఎస్ రాజు దర్శకత్వంలో...
మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు (MS Raju) రచన, దర్శకత్వంలో 'మళ్ళీ పెళ్లి' తెరకెక్కుతోంది. ఇందులో నరేష్ జోడిగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను నరేష్ పున:ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... త్వరలో టీజర్ విడుదల కానుంది.
ఏప్రిల్ 13న 'మళ్ళీ పెళ్లి' టీజర్
Malli Pelli Movie Teaser : ఈ నెల 13న... గురువారం 'మళ్ళీ పెళ్లి' టీజర్ విడుదల చేయనున్నట్లు నరేష్ తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన తెలిపారు. ఆల్రెడీ విడుదల అయిన గ్లింప్స్, ప్రచార చిత్రాల్లో నరేష్, పవిత్ర జోడీ కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. వేసవిలో సినిమా విడుదల కానుంది.
Experience the Magic of Love with the Teaser of #MalliPelli - Telugu ❤️🔥#MattheMaduve - Kannada ❤️🔥
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) April 8, 2023
RELEASING ON APRIL 13th 🫶
Directed by @MSRajuOfficial #PavitraLokesh @vanithavijayku1 @VKMovies_ @EditorJunaid @adityamusic
Summer 2023 Release! pic.twitter.com/3AT2b7HQvw
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు : జునైద్ సిద్ధిక్, ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల్ రెడ్డి, సాహిత్యం : అనంత శ్రీరామ్.
నరేష్, పవిత్ర మధ్య ఏం ఉంది?
నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్ మధ్య సంబంధం (Pavitra Lokesh Naresh Relationship) ఏమిటో తెలుసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులతో పాటు కన్నడ ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. బెంగళూరులో నరేష్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రా లోకేష్ చేసిన హడావిడి అందరికీ ఇంకా గుర్తే. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా నరేష్ పోస్ట్ చేసిన లిప్ లాక్ వీడియో అయితే సంచలనం సృష్టించింది. అందువల్ల, 'మళ్ళీ పెళ్లి' సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. వీడియో గ్లింప్స్ విడుదల చేయడానికి ముందు అది లీక్ కావడంతో నిజ జీవితంలో నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారని చాలా మంది భావించారు.
త్వరలో ప్రెస్ మీట్ పెడతా - నరేష్!
ఆ మధ్య జరిగిన 'ఇంటింటి రామాయణం' సినిమా ప్రెస్‌మీట్‌లో 'ఇప్పుడు సల్మాన్ ఖాన్, ప్రభాస్ పెళ్లి గురించి తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. తెలుగు ప్రజలు అందరూ మీ పెళ్లి ఎప్పుడు అని చూస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పెళ్లి అయ్యిందని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటి?' అని ప్రశ్నించగా... ''నేను త్వరలో ప్రెస్ మీట్ పెడతా. నేను ఎప్పుడూ మీడియా ఫ్రెండ్లీనే. రియల్ లైఫ్, రీల్ లైఫ్ ప్రతి వ్యక్తికీ ఉంటుంది. నా జీవితం నేను జీవిస్తా. నేను నమ్మేది అది. ఇప్పుడు ఈ సినిమా విషయాలను డైవర్ట్ చేయాలని అనుకోవడం లేదు'' అని నరేష్ సమాధానం ఇచ్చారు.
Also Read : 'పుష్ప 2' లుక్ మీద కొత్త రచ్చ - 'కాంతార'లా ఉందేంటి?
Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి
Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా
Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?
Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?
‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?