అన్వేషించండి

Malli Pelli Movie Release Date : నరేష్, పవిత్ర 'పెళ్లి' చిత్రమ్ - ఈ నెలలోనే థియేటర్లోకి

Naresh Vijaya Krishna Pavitra Lokesh Movie : నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన సినిమా 'మళ్ళీ పెళ్లి'. ఈ నెలలో థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. 

నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Movie 2023). ఇందులో ఆయనకు జోడీగా, కథానాయికగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటించారు. ఈ నెలలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు నేడు వెల్లడించారు. 

మే 26న 'మళ్ళీ పెళ్లి' విడుదల
Malli Pelli Release On May 26th : వేసవిలో 'మళ్ళీ పెళ్లి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నెల 26న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. 

ఎంఎస్ రాజు దర్శకత్వంలో...
'మళ్ళీ పెళ్లి' చిత్రానికి మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకుడు. నరేష్ విజయ కృష్ణ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్‌ సంస్థను పున:ప్రారంభించారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ఆయన తెలిపారు. 

Also Read నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన తొలి పాట!
ఇటీవల సినిమాలో తొలి పాట 'ఉరిమే కాలమా...'ను విడుదల చేశారు. ఆ గీతానికి అనంత శ్రీరామ్ (Anantha Sriram) సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సురేష్ బొబ్బిలి అందించిన బాణీ అందించారు. లేటు వయసులో ప్రేమలో పడిన ఓ జంట పరిస్థితిని పాటలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

Also Read ప్రియాంక చోప్రా వేసుకున్న నెక్లెస్ అమ్మితే పాన్ ఇండియా సినిమా తీయొచ్చు!

కొన్ని రోజుల క్రితం 'మళ్ళీ పెళ్లి' టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... నిజంగా సినిమా టీజరా? లేదంటే నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన సంఘటనలను రీ క్రియేట్ చేశారా? రియల్ స్టోరీని సినిమాగా తీశారా? అనే సందేహం కలుగుతుంది. అంతలా టీజర్ కట్ చేశారు. 

Naresh and Pavitra relationship : నరేష్, పవిత్రా లోకేష్ మధ్య సంబంధం ఏంటి? తెలుసుకోవాలని తెలుగు ప్రజలు, కన్నడ ప్రేక్షకులూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకనేది అందరికీ తెలిసిందే. నరేష్, పవిత్ర సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుగు  కూస్తోంది. ఆ ప్రచారానికి తోడు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు చేశారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని హోటల్ కు వెళ్లడం... ఆ మధ్య బెంగళూరులో హై డ్రామా నడిచింది. తమకు మద్దతు ఇవ్వాలని పవిత్రా లోకేష్ ప్రేక్షకులను కోరారు.  'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే... అవన్నీ గుర్తుకు వస్తాయి. మరోసారి ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడతాయి. నరేష్, పవిత్రా లోకేష్ రియల్ లైఫ్ క్యారెక్టర్లు చూస్తే... రమ్యా రఘుపతి పాత్రలో నటి వనితా విజయ్ కుమార్ యాక్ట్ చేసినట్టు ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఇది సినిమా కాదు, నరేష్ - పవిత్ర బయోపిక్ అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget