News
News
X

Nani Dasara: రెండు పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డా: నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాల్లో మీడియాతో నాని మాట్లాడుతూ షూటింగ్ సందర్భంగా రెండు ప్రమాదాల నుండి బయట పడ్డట్లుగా పేర్కొన్నాడు

FOLLOW US: 
Share:

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. మార్చి 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో హీరో నాని సింగరేణి లోకల్‌ రైళ్లలో బొగ్గును దొంగిలించే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ సమయంలో తనతో పాటు యూనిట్ సభ్యులంతా కూడా చాలా కష్టపడ్డారని నాని పేర్కొన్నారు.

ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని మాట్లాడుతూ.. నా మేకప్ కోసం ప్రతి రోజు చాలా సమయం కేటాయించాల్సి వచ్చేది. షూటింగ్‌ సమయంలో అత్యంత వేడి ఉండటం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. సెట్ లో  రెండు సార్లు పెద్ద ప్రమాదాల నుంచి బయట పడ్డాను. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఒక మంచి సినిమా రూపొంది.. మీ ముందుకు రాబోతుందన్నారు.

నాని ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నారు. ఉత్తర భారతంలో ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారనే సమాచారం అందుతోంది. నాని గతంలో ‘శ్యామ్‌ సింగరాయ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయాలని భావించినప్పటికీ ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈసారి కచ్చితంగా ‘దసరా’ సినిమాతో దేశవ్యాప్తంగా నాని పాపులారిటీ దక్కించుకునే అవకాశాలున్నాయని నాని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘దసరా’ ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీగా నిలుస్తుందని టీజర్ విడుదల సందర్భంగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గతేడాది విడుదలైన భారీ విజయాలను సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌2’, ‘కాంతార’, ‘పొన్నియన్ సెల్వన్‌’ సినిమాల మాదిరిగా ‘దసరా’ సినిమా ఈ ఏడాది ఎక్కువగా మాట్లాడుకునే సినిమా అవుతుందంటూ నాని చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాను రూపొందించిన శ్రీకాంత్‌ ఓదెల పేరు ముందు ముందు ఇండస్ట్రీలో మారుమోగనుందని నాని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘దసరా’పై మొదటి నుండి భారీ అంచనాలు...

 ‘దసరా’ కచ్చితంగా ఓ సెన్సేషన్ హిట్ కొడుతుందని నాని ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ‘దసరా’ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో యూనిట్‌ సభ్యులు సఫలం అయ్యారు. ఫలితంగా నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు.

ఈ సినిమాలో నానికి జోడీగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి లుక్‌ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. నాని, కీర్తి సురేష్ గతంలో ‘నేను లోకల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత హిట్ జోడీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్

Published at : 10 Mar 2023 11:10 AM (IST) Tags: Keerthy Suresh Dasara Srikanth odela Nani Nani Accident

సంబంధిత కథనాలు

Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్

Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్

Manoj wishes Ram Charan: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Manoj wishes Ram Charan: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!

HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!

చేతిలో చెంబు, కండలు తిరిగిన బాడీతో బెల్లంకొండ - హిందీ ‘ఛత్రపతి’ ఫస్ట్ లుక్ చించేశారుగా!

చేతిలో చెంబు, కండలు తిరిగిన బాడీతో బెల్లంకొండ - హిందీ ‘ఛత్రపతి’ ఫస్ట్ లుక్ చించేశారుగా!

‘గేమ్ చేంజర్’గా రామ్ చరణ్, టైటిల్‌తో హీట్ పెంచేసిన శంకర్

‘గేమ్ చేంజర్’గా రామ్ చరణ్, టైటిల్‌తో హీట్ పెంచేసిన శంకర్

టాప్ స్టోరీస్

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?