Nani Speech: "నాకు కోపమొచ్చింది.." - 'సరిపోదా శనివారం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాని కామెంట్స్
Nani Speech: నాని 'సరిపోదా శనివారం' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్లో నేడు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ ఆసక్తిర కామెంట్స్ చేశాడు.
Nani Comments in Trailer Launch Event: హీరో నాని మోస్ట్ అవైయిటెడ్ చిత్రం 'సరిపోదా శనివారం'. దసరా, హాయ్ నాన్న వంటి సాలీడ్ హిట్స్ తర్వాత నాని నటిస్తున్న చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. పైగా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య ప్రతికథానాయకుడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఆగస్టు 29న మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఆగస్టు 13న ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ప్రముఖ సుదర్శన్ థియేటర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తారు. థియేటర్ మొత్తం అభిమానుల కేకలు, అల్లరితో దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా దురర్శన్ థియేటర్‌లో ట్రైలర్ ప్రదర్శించారు. ఇక ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అత్యాత్సాహం చూస్తుంటే మరింత ఆసక్తి పెరిగిపోతున్నాయి.
కడుపు నిండిపోయింది..
ట్రైలర్ రిలీజ్ అనంతరం నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సుదర్శన్ థియేటర్‌తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘జెర్సీ, దసరా స్పెషల్ షోలు ఇక్కడే పడ్డాయని, సుదర్శన్‌లో ఎన్నో చిత్రాలు చూశానన్నాడు. నటుడిని కాకముందు ఇక్కడ మీ ఒక్కడిగా ఎన్నో సినిమాలు చూశానని, నటుడిని అయ్యాక కూడా తన సినిమాల స్పెషల్ షో చూశానని ఈ థియేటర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. సుదర్శన్ థియేటర్ ఓ సాధారణ వ్యక్తి, హీరో తనకు ఎన్నో సినిమా అనుభూతులను ఇచ్చిందని పేర్కొన్నాడు. ఇక ఈ ట్రైలర్ కట్ చేసిన అనంతరం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తనకు చూపించాడని, ఇది ఇంట్లో, ఫోన్‌లో చూడాల్సిన ట్రైలర్ కాదని.. ఇలా సుదర్శన్ థియేటర్లో బిగ్‌స్క్రీన్‌పై అభిమానుల మధ్య చూసే ట్రైలర్ అనిపించిందన్నాడు. అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఇక్కడ ఫిక్స్ చేశామని చెప్పాడు.
నాకు కోపం వచ్చింది..
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాలోని డైలాగ్ చెప్పాలని కోరగా.. ఈ సినిమాలో డైలాగ్స్ ఏం లేవని, మొత్తం యాక్షనే అంటూ సరిపోదా శనివారంలో యాక్షన్ ఏ రేంజ్ ఉంటుందో ఒక్క మాటలో చెప్పాడు. ఈ మంత్ ఎండ్ అదిరిపోతుందని, మీ అందరితో కలిసి ట్రైలర్ చూశానని, కడుపు నిండిపోయిందంటూ ఫ్యాన్స్ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీలో డైలాగ్ చెప్పాలని అడగ్గా.. ఈ సినిమాలో డైలాగ్ ఉండవని, అంతా యాక్షనే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలన్నాడు. ఉన్న డైలాగ్‌లను సినిమా రిలీజ్ వరకు దాచేద్దామంటూ చమత్కారించాడు. అనంతరం ట్రైలర్‌లోనే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌ని అలరించాడు. నాకు కోపం వచ్చింది.. నాకు కోపం వచ్చిందంటే వీళ్లు నా మనుషులు.. వీళ్ల సమస్య నా సమస్య.. వాళ్ల సంతోషం నా సంతోషం.." అంటూ థియేటర్‌ని దద్దరిల్లించాడు. మొత్తానికి తన స్పీచ్‌తో ఈవెంట్ స్పిచ్‌తో ఎనర్జీతో జోష్ నింపాడు.
Also Read: ఇండియన్ ఐడల్ 3 షోలో నాని లీక్స్ - 'సరిపోదా శనివారం'లోని ఆ పాట పాడి షాకిచ్చాడు..