Saripodhaa Sanivaaram: ఆకట్టుకుంటున్న 'సరిపోదా శనివారం' ఫస్ట్ సింగిల్ ప్రోమో - ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..
Nani Garam Garam First Single Promo: న్యాచులర్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది.
Saripodhaa Sanivaaram First Single Promo Out: న్యాచులర్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. 'దసరా', 'హాయ్ నాన్న' చిత్రాలతో నాని నుంచి వస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్ కూడా అంచనాలు పెంచేస్తోన్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్ చేసింది మూవీ టీం. జూన్ 15న ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్ చేసింది మూవీ టీం.
ఫస్ట్ సింగిల్‌కి మరో ఇంకా రెండు రోజులు ఉందనగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. "గరం గరం యముడయో" అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, లిరిక్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజికల్ ఆడియోకు మరింత ప్లస్ అయ్యేలా ఉందనిపిస్తుంది. ఇక ఫుల్ సాంగ్ కోసం జూన్ 15 వరకు వేచి చూడాల్సిందే. శనివారం ఉ.11 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడిచింది మూవీ టీం.
View this post on Instagram
ఇదిలా ఉంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. జూన్ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు పలు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కాగా ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే ఇది హీరో నాని క్యారెక్టరైజేషన్‌ని తెలియజేసేలా ఉందనిపిస్తోంది. పవర్పుల్ సాగిన ఈ పాట గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.
ఓటీటీ రైట్స్
కాగా 'సరిపోదా శనివారం' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఇక ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడని తెలిసి నాని ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో నానికి మంచి హిట్ పడటమే కాదు దిల్ రాజుకు లాభాలు కూడా బాగానే వస్తయంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ఢిల్ కూడా క్లోజ్ అయిన్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుస. ఈ మూవీని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలకు భారీగా చెల్లించిందట. ఇక అన్ని భాషలకు కలిపి ఏకంగా రూ. 45 కోట్లకు ఢిల్ కుదుర్చుకుందట. ఇక నాని కెరీర్‌లో అత్యంత ఓటీటీ ధర పలికిన చిత్రం సరిపోదా శనివారం నిలిచింది.