అన్వేషించండి

Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ - సినీ ఎంట్రీకి సిద్ధమవుతోన్న మోక్షజ్ఞ, ఆయన దగ్గర ట్రైనింగ్!

Mokshagna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ప్రస్తుతం వైజాగ్ లో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Nandamuri Mokshagna acting training in Vizag : నందమూరి వారసుడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఇప్పుడు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ మోక్షజ్ఞ ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు? అతని సినిమా ఎంట్రీ ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే..
 
ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అనేక రకాల వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏది నిజం కాలేదు. కొద్ది సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై రకరకాల చర్చలు జరిగాయి. ఆ మధ్య మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై అసలు బాలయ్య వారసుడు హీరోగా సెట్ అవుతాడా? అనే వాదనలు సైతం వినిపించాయి. ఆ తర్వాత మోక్షజ్ఞ తన లుక్ చేంజ్ చేసుకొని ఫిట్ గా కనిపించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. బాలయ్య వారసత్వాన్ని కొనసాగించాలంటే మోక్షజ్ఞ ప్రతి ఒక్క అంశంలో ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ నవంబర్ నుంచి వైజాగ్ లో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. అంతేకాకుండా తన ఫిజిక్ పై కూడా దృష్టి సారిస్తూ బరువు తగ్గి సరికొత్త లుక్ లో కనపడేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ కి నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ లాంటి వారి దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకోవడం విశేషం. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు, ప్రభాస్, అలాగే మరి కొంతమంది టాలీవుడ్ స్టార్స్ కి నటనలో శిక్షణ ఇచ్చారు సత్యానంద్. పవన్ కళ్యాణ్ కి నటనలో శిక్షణ ఇచ్చింది కూడా ఈయనే. అలాంటి ఆయన దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నారనే విషయం తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లయితే కచ్చితంగా మోక్షజ్ఞ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడంటూ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 2017 లోనే మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఇవ్వాల్సింది. 'ఆదిత్య 369' సిక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలో చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ మోక్షుని పరిచయం చేస్తున్నట్లు వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అందులోనూ ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. మరి మోక్షజ్ఞను సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే డైరెక్టర్ ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇదే ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్ ఉండడం గ్యారెంటీ అని నందమూరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
 

టాప్ హెడ్ లైన్స్

Mrunal Thakur : ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Samantha Son : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget