Naa Saami Ranga : అక్కడ డిజాస్టర్ అయిన 'నా సామిరంగ' - నాగార్జున ఇక నుంచైనా జాగ్రత్త పడక తప్పదా?
Naa Saami Ranga : నాగార్జున 'నా సామిరంగ' మూవీ ఓవర్సీస్ లో డిజాస్టర్ గా నిలిచింది.
Nagarjunas's Naa Saami ranga Disaster In Overseas : టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ బిన్నీ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఓ మలయాళ సినిమాకి రీమేక్ గా 'నా సామిరంగ' తెరకెక్కింది. ఎలాగైనా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని పట్టుబట్టి నాగార్జున మూడు, నాలుగు నెలల్లోనే సినిమాని పూర్తి చేసేసారు.
ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. విలేజ్ నేటివిటీతో పాటూ నాగార్జున వింటేజ్ లుక్, అల్లరి నరేష్, ఆశికా రంగనాథ్ ల పర్ఫామెన్స్ ఆకట్టుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయిన 'నా సామిరంగ' ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ అయింది.
ఓవర్సీస్ లో డిజాస్టర్ గా 'నా సామిరంగ'
'నా సామిరంగ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. అదే సమయంలో ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ లో పెట్టిన పెట్టుబడిలో 50% కూడా రికవరీ చేయలేకపోయిందట. దీంతో ఒకప్పటిలా నాగార్జున సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ లో ఆదరణ లేదనే విషయం స్పష్టమవుతుంది. ఇక సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత ఓవర్సీస్ లో కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయినట్లు తెలిసింది.
ఇక ఫుల్ రన్ లో అక్కడ ఈ సినిమా నష్టాలనే మిగిల్చినట్లు చెబుతున్నారు. నిజానికి నాగర్జున లాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోకి ఓవర్సీస్ లో ఇలా జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తన స్థాయి సక్సెస్ అందుకోవాలంటే నాగర్జున కంటెంట్ ఉన్న కథలను ఎంకరేజ్ చేయాలని ఇకనుంచి అయినా తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వహించాలని విశ్లేషకులు అంటున్నారు.
'నా సామిరంగ' ఓటీటీలోకి వచ్చేది అప్పుడే
'నా సామిరంగ' ఓటిటి రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. ఇది ఒక విధంగా రికార్డ్ ప్రైస్ అనే చెప్పాలి ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఒక నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా ఫిబ్రవరి 15న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
'నా సామిరంగ' కాస్ట్ అండ్ క్రూ
విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సర్ థిల్లాన్, రావు రమేష్, నాజర్, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మించారు. పవన్ కుమార్ సమర్పకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్. చోటా కె. ప్రసాద్ ఎడిటర్.
Also Read : ఆమె అలా చేసినందుకు సంతోషిస్తున్నా - పూనమ్ పాండే డెత్ స్టంట్ పై మాజీ భర్త స్పందన ఇదే!