అన్వేషించండి

Balakrishna: నందమూరి బాలకృష్ణతో నాగ వంశీ మూవీ - పెద్దగానే ప్లాన్ చేస్తున్నారట!

డైరెక్టర్ బాబిని దర్శకత్వంలోబాలకృష్ణ చేయబోయే సినిమాకు సంబంధించిన లేటెస్ట్ గా ఓ అఫిషియల్ అప్ డేట్ వచ్చింది. జూన్ 10న ఆయన రోజు సందర్భంగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు నిర్మాత నాగ వంశీ హింట్ ఇచ్చారు

Nandamuri Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం 'NBK 108' అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ బాబిని ఫైనలైజ్ చేశారు. కాగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ అధికారికంగానే ప్రకటించారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు ఆయన సోషల్ మీడియా ద్వారా క్లూ ఇచ్చారు. దాంతో పాటు ఓ సింహం ఎమోజీని కూడా ఆయన క్యాప్షన్ లో జోడించారు. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలు కానున్నాయని సమాచారం.

ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాతో బాబిని తన ఖాతాలో హిట్ ను వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా తన టాలెంట్ చూపించిన ఆయన.. మరీ ముఖ్యంగా ఓ సీనియర్ హీరోని వింటేజ్ లుక్ లో చూపించడం అందర్నీ ఆకర్షించింది. తద్వారా బాబిని మెగా ఫ్యాన్స్ అందరికీ దగ్గరయ్యాడు. దాంతో ఈ దర్శకుడుతో సినిమా చేయటానికి బాలయ్య ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టుకు  సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని బాబి కథ సిద్ధం చేస్తున్నారనే వార్తలు కూడా షికారు చేశాయి. చిరుతో సినిమా చేసేటప్పటి నుంచే బాలయ్యతోను సినిమా చేస్తారన్న వార్తలు ప్రచారమయ్యాయి.

ప్రస్తుతం బాలయ్య 'ఎన్బీకే 108 (NBK 108)' సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బాబినితో బాలయ్య చేసే సినిమా 109వ సినిమా కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన చేస్తున్న అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన వెంటనే, యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో కలిసి బాలకృష్ణ మరోసారి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. బోయపాటి సినిమా తర్వాతే బాబి మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్యాప్ లో బాబి, తన కథకు మరిన్ని మెరుగులు దిద్దుకోవచ్చని పలువురు అంటున్నారు. బాల‌య్య ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ వెంట‌నే బోయ‌పాటి సినిమా మొద‌ల‌వుతుంది. బోయ‌పాటి సినిమాతో పాటుగా బాబి సినిమానీ మొద‌లెట్టే అవ‌కాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చిరు, బాబిని కాంబినేషన్ మంచి సక్సెస్ ను నమోదు చేసింది. ఇప్పుడు బాబిని, బాలయ్య కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో అలరిస్తుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుస సినిమాలతో బిజీ అయిన బాలయ్య.. ఒక్కో సినిమాను కంప్లీట్ చేసుకుంటూ కెరీరీ లో బిజీగా మారిపోయారు.

Read Also : కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Ram Charan Remuneration: హాట్‌టాపిక్‌గా రామ్‌ చరణ్‌  'గేమ్‌ ఛేంజర్‌' రెమ్యునరేషన్‌ - ఎంతో తెలుసా? 
హాట్‌టాపిక్‌గా రామ్‌ చరణ్‌  'గేమ్‌ ఛేంజర్‌' రెమ్యునరేషన్‌ - ఎంతో తెలుసా? 
Top Headlines: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget