Naga Chaitanya - Sobhita: స్టన్నింగ్ లుక్‌లో కొత్త జోడీ... బాలీవుడ్ దర్శకుడి కుమార్తె పెళ్ళి రిసెప్షన్‌లో చై శోభిత సందడి
ముంబైలో జరిగిన ఆలియా కశ్యప్ - షేన్ గ్రెగోయిర్ వివాహ రిసెప్షన్‌కు నూతన వధూవరులు శోభితా ధూళిపాళ్ల- నాగ చైతన్య హాజరయ్యారు. ఆ టైమ్ లో జంట స్టన్నింగ్ లుక్ లో దర్శనం ఇచ్చారు.
కొత్త జంట శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) - నాగ చైతన్య (Naga Chaitanya) తమ పెళ్లి తరువాత మరో పెళ్ళిలో దర్శనం ఇచ్చారు. చై-శోభిత ఇద్దరూ ముంబైలోని సెలబ్రిటీ మ్యారేజ్ లో స్టన్నింగ్ లుక్ లో కన్పించారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆలియా పెళ్ళిలో శోభిత-చై
శోభితా ధూళిపాళ్ల - నాగ చైతన్య ఇటీవల డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులా సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. గత రాత్రి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ - షేన్ గ్రెగోయిర్ వివాహ రిసెప్షన్‌లో ఈ జంట నూతన వధూవరులుగా మొదటిసారి బయట కనిపించారు. అనురాగ్ కశ్యప్ రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ 'రామన్ రాఘవ్ 2.0'తో శోభిత సినిమా ఇండస్ట్రీలోకి కాలు పెట్టింది. 2016 లో రిలీజ్ అయిన ఈ మూవీతో అనురాగ్ శోభితకు మంచి బ్రేక్ ఇచ్చాడు. తరువాత ఆమె నెట్‌ఫ్లిక్స్ 2020 హారర్ ఆంథాలజీ 'ఘోస్ట్ స్టోరీస్'లో కూడా కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇందులోని ఓ సెగ్మెంట్ కు అనురాగ్ దర్శకత్వం వహించారు. అలాగే అనురాగ్ సహ నిర్మాతగా వ్యవహచిన 2019 మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'మూథోన్'లో కూడా శోభిత ఫిమేల్ లీడ్ రోల్ పోషించింది. దీనికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించింది. ఇలా అనురాగ్ కశ్యప్ తో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే కొత్త జంట చై-శోభిత ఆయన కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. రిసెప్షన్ లో శోభిత - నాగ చైతన్య స్టైలిష్ అండ్ స్టన్నింగ్ గా కన్పించారు. శోభిత బంగారు-ఆకుపచ్చ రంగు దుస్తువుల్లో కన్పించి అబ్బురపరిచింది. నాగ చైతన్య క్లాసిక్ బ్లాక్ సూట్‌లో అందంగా కనిపించాడు. రిసెప్షన్‌లో ఈ జంట సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. కాగా పెళ్లి తరువాత నాగ చైతన్య - శోభిత జంట హాజరైన మొట్టమొదటి సెలబ్రిటీ ఈవెంట్ ఇదే. అంతకు ముందు వీరిద్దరూ శ్రీశైలంలో దైవ దర్శనం చేసుకుంటూ కన్పించారు.
View this post on Instagram
ఇద్దరూ నూతన వధువులే
ఇక ఆలియా పెళ్ళిలో మెరిసిన శోభిత కూడా నూతన వధువే కావడం విశేషం. నాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ళ పెళ్లి గత బుధవారం తెలుగు సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. అయితే పెళ్ళయి వారం కూడా కాకముందే ఈ జంట ఆలియా పెళ్ళికి హాజరై, కొత్త జంటను ఆశీర్వదించింది. మరోవైపు ఆలియా కశ్యప్ తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్‌ను బుధవారం ముంబైలో ఘనంగా వివాహం చేసుకుంది. ఆలియా - షేన్ గత సంవత్సరం ముంబైలో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2023 మేలో ఇన్‌స్టాగ్రామ్‌లో తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని ప్రకటించారు. తాజాగా జరిగిన ఆలియా పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా... శోభిత చివరిసారిగా లవ్, సితారలో కనిపించింది. నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి మరోసారి నాగ చైతన్యకు జోడీగా కన్పించబోతోంది.
Also Read: దటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్