Naga Chaitanya - Dulquer Salmaan: అప్పుడు దుల్కర్, నేను హీరోస్ అవుతామనుకోలేదు! మా డిస్కషన్స్ ఎలా ఉండేవంటే? - నాగచైతన్య
దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య హీరోలు అవ్వాలనుకోలేదట. హీరోలు కాకముందు తమ డిస్కషన్స్ వేరుగా ఉండేవని అక్కినేని నాగచైతన్య తెలిపారు. ఆయన ఇంకా ఏం అన్నారంటే...
నాగచైతన్య... ఏయన్నార్ మనవడు, మన్మథుడు నాగార్జున కుమారుడు. అక్కినేని వారసుడిగా ఆయన ఇండస్ట్రీలోకి రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించలేదు. అలాగే, దుల్కర్ సల్మాన్! ఆయన మలయాళ స్టార్ మమ్ముట్టి కుమారుడు. ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఆశ్చర్యం ఏమీ కాదు. అయితే... వీళ్ళిద్దరూ హీరోలు కాకముందే ఒకరికొకరు తెలుసు. అప్పట్లో తాము హీరోలు అవ్వాలని అనుకోలేదని నాగచైతన్య తెలిపారు.
దుల్కర్ సల్మాన్ నటించిన తాజా సినిమా 'హే సినామికా' గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా విచ్చేసిన నాగచైతన్య... దుల్కర్ సల్మాన్‌తో తన బాండింగ్ గురించి మాట్లాడారు. "నాకు దుల్కర్ చెన్నైలో తెలుసు. అప్పట్లో మేం ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడుకోలేదు. ఆటోమొబైల్స్, ఇతర విషయాలు డిస్కస్ చేసేవాళ్ళం. యాక్టర్స్ (హీరోలు) అవుతామని అనుకోలేదు. కానీ, ఇప్పుడు హీరోలుగా ఓకే స్టేజిపై ఉన్నాం" అని నాగచైతన్య తెలిపారు.
Also Read: 'కొత్త ప్రయాణం' చైతు పోస్ట్ వైరల్ - దేని గురించో తెలుసా?
'హే సినామికా' చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకత్వం వహించారు. ఆమె గురించి నాగచైతన్య మాట్లాడుతూ "బృంద గారి కొరియోగ్రఫీకి నేను వీరాభిమాని. మాంటేజ్ సాంగ్స్ చిత్రీకరించడంలో ఆమెది సెపరేట్ స్టైల్. 'మనం'లో 'కనులను తాకే...' పాట ఆమే చేశారు. ఇంకా ఎన్నో హిట్ సాంగ్స్ చేశారు. ఓ ప్రేమకథా చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తున్నారని తెలిసి హ్యాపీగా అనిపించింది. దర్శకురాలిగా భారీ విజయాలు సాధించినా... కొరియోగ్రఫీ చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. 'హే సినామికా' ట్రైలర్ బావుందని, విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
'హే సినామికా'తో ప్రేక్షకులు ప్రేమలో పడతారని, సినిమా చూశాక ఎమోషనల్ అవుతారని దుల్కర్ సల్మాన్ అన్నారు. 'హే సినామికా'లో కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు.
Also Read: యంగ్ హీరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్, ఆ లింక్స్ ఓపెన్ చేయొద్దు
View this post on Instagram