Naga Chaitanya: కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నంబర్ వన్ ఫ్యాన్... ట్రోలర్స్‌కు దిమ్మ తిరిగేలా నాగ చైతన్య స్పీచ్
Ka Pre Release Event: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ట్రోల్స్, ట్రోలర్స్ గురించి మాట్లాడారు. ఇంతకీ, ఆయన ఏమన్నారంటే?
'కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జర్నీకి నేను నెంబర్ వన్ ఫ్యాన్' - ఈ మాట అన్నది ఎవరో సామాన్య ప్రేక్షకులు కాదు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya). తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు, కల్మషం లేని మంచి మనిషిగా అందరిలో పేరు తెచ్చుకున్న యువకుడు ఈ మాట అన్నాడంటే... హీరోగా కిరణ్ అబ్బవరం జర్నీ నిజంగా స్ఫూర్తివంతమైనదని చెప్పాలి. నాగచైతన్య ఈ మాట ఎందుకు అన్నారు అంటే...
కిరణ్ అబ్బవరం భయపడాల్సిన అవసరం లేదు!
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'క' (KA Movie). ఈ గురువారం (అక్టోబర్ 31న) తెలుగులో విడుదల అవుతుంది. దీపావళి సందర్భంగా ఒక్క రోజు ముందు... అంటే అక్టోబర్ 30న తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
నాగచైతన్య కంటే ముందు మాట్లాడిన కిరణ్ అబ్బవరం తన జర్నీ, తనను ట్రోల్ చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కిరణ్ అబ్బవరం అసలు భయపడాల్సిన అవసరం లేదని అతనికి నాగచైతన్య ధైర్యం చెప్పారు.
'క' ప్రీ రిలీజ్ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ... ''నేను 'క' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్తున్నానని స్నేహితుడు ఒకరితో చెప్పాను. కిరణ్ అబ్బవరం సినిమానా? అని అడిగారు. సినిమా టైటిల్ కంటే హీరోగా కిరణ్ అబ్బవరం పేరు ముందు చెబుతున్నారు. దాని అర్థం ఓ గుర్తింపు తెచ్చుకున్నాడని. కిరణ్ అబ్బవరం... నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు. నీలో చాలా శక్తి ఉంది'' అని తెలిపారు.
నాగ చైతన్యతో కిరణ్ అబ్బవరం పరిచయం ఎలా జరిగింది?తనకు కిరణ్ అబ్బవరం ఎలా పరిచయం అయ్యాడనేది కూడా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తెలిపారు. ''నాకు కార్స్ అంటే ఇష్టం. అప్పుడప్పుడు రేసింగ్ ట్రాక్స్ దగ్గరకు వెళ్తూ ఉంటాను. ఆ సంగతి అందరికీ తెలుసు. ఇటీవల చెన్నై వెళ్లాను. సాధారణంగా రేసింగ్ ట్రాక్స్ దగ్గర సినిమా వ్యక్తులు తక్కువ కనపడతారు. అసలు ఎవరూ ఉండరు. అక్కడ కిరణ్ అబ్బవరాన్ని చూసి నేను షాక్ అయ్యాను. సాధారణంగా నేను ఇంట్రోవర్ట్. ఇతర వ్యక్తులతో తక్కువ మాట్లాడుతా. కిరణ్ అబ్బవరంతో మాట్లాడిన తర్వాత చాలా వెంటనే కలిసిపోయా. ఒక మంచి ఫీలింగ్ ఏర్పడింది. 'క' ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. నన్ను ఈ ఈవెంట్ కు పిలవడం గర్వంగా ఫీల్ అవుతున్నాను'' అని తెలిపారు.
Also Read: చిరంజీవి లివింగ్ లెజెండ్... మెగాస్టార్ స్పీచ్ తర్వాత నాగార్జున ట్వీట్ వైరల్... ఏమన్నారో చూశారా?
కన్నీళ్లు పెట్టించిన కిరణ్ మాటలు....
ట్రోల్ చేసే వాళ్ల బుర్రలో ఏం లేదన్న చైతన్య!
'క' ప్రీ రిలీజ్ వేడుకలో తల్లి గురించి కిరణ్ అబ్బవరం చెప్పిన మాటలు తనతో కన్నీళ్లు పెట్టించాయని నాగ చైతన్య అన్నారు. కిరణ్ వెనుక అతని తల్లితో పాటు భార్య రహస్య ఉన్నారని... ప్రతి విజయవంతమైన మగాడి వెనుక ఒక మహిళ ఉంటారని చెబుతారని, కిరణ్ వెనుక ఇద్దరు ఉన్నారని ఆయన అన్నారు. కిరణ్ అబ్బవరం మీద ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి కూడా నాగ చైతన్య మాట్లాడారు. ఒక కీబోర్డ్ లేదా మొబైల్ పట్టుకొని ఈ సంవత్సరం వచ్చినట్లు ఏదేదో రాసేస్తారని కానీ వాళ్ళ బుర్రలో ఏమీ ఉండదని నాగచైతన్య బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
Also Read: చైతన్య, శోభిత మీదే అందరి కళ్లు... ఆల్రెడీ అక్కినేని కోడలు హోదా, అదీ పెళ్ళికి ముందు!