Naga Chaitanya - Fake News Alert: అదంతా రూమరే... నాగచైతన్య - శోభిత ధూళిపాళ పెళ్లి గురించి జరుగుతున్న ఆ ప్రచారంలో నిజం లేదు
Naga Chaitanya and Sobhita Wedding: అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వెడ్డింగ్ రైట్స్ ఓటీటీకి అమ్మేశారంటూ వచ్చిన వార్తలన్నీ రూమర్లే. ఇది పక్కా పర్సనల్, ప్రైవేట్ ఈవెంట్ అని క్లారిటీ వచ్చింది టీమ్.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ పెళ్లిని ఓటీటీలకు అమ్మేస్తూ పర్సనల్ విషయాలను కూడా క్యాష్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ హీరో హీరోయిన్లకు సినిమా ప్రపంచంలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే వాళ్ళ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను ఓటీటీలు భారీ ధరకు చేజిక్కించుకుంటున్నాయి. అలా స్టార్స్ కు ఉన్న క్రేజ్ ను ఓటీటీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. మరోవైపు దీనివల్ల సెలబ్రిటీలకు కూడా లాభమే. ఈ ట్రెండ్ ముందుగా బాలీవుడ్ లో మొదలైంది. సౌత్ లో మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో త్వరలో ఒక్కటి కాబోతున్న సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నాగ చైతన్య - శోభిత ధూళిపాళ తమ పెళ్లిని ఓటీటీ ప్లాట్ ఫామ్ కు భారీ ధరకు అమ్మేశారని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అవన్నీ ఒట్టి పుకార్లే అనే విషయం వెలుగులోకి వచ్చింది.
నాగ చైతన్య పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటిటి సంస్థకు అమ్మేశారు అనే వార్త తెరపైకి రాగానే కొంతమంది ఆశ్చర్యపోతే, మరి కొంత మంది మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ తాజాగా ఇవన్నీ ఫేక్ వార్తలనే విషయం ఇన్సైడ్ వర్గాల నుంచి కన్ఫర్మ్ కావడంతో మంచి పని చేశారని అంటున్నారు. లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా ఆ డాక్యుమెంటరీకి నయన్ డాక్యుమెంటరీలాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటిదాకా పడిన టెన్షన్ నుంచి అక్కినేని ఫ్యాన్స్ ఇప్పుడు రిలీఫ్ అయ్యారు. ఇక నాగచైతన్య - శోభిత ఇద్దరూ తమ స్పెషల్ డేని ప్రైవేట్ గా, పర్సనల్ గా ఉంచాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య, శోభిత డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహాన్ని చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నాయి.
రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో నయనతార కెరీర్ తో పాటు డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పెళ్లి, ఎఫైర్లు, సినిమా ఇండస్ట్రీలో ఎదురైన ఇబ్బందులు, పిల్లలు... వంటి విషయాలను చూపించారు. అయితే ఈ డాక్యుమెంటరీకి ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా నయనతార డాక్యుమెంటరీలో తీసిన విగ్నేష్ శివన్ ఎపిసోడ్ కేవలం నెట్ ఫ్లిక్స్ కోసమే ఒక డ్రామాలాగా చిత్రీకరించారు అనే విమర్శలు వినిపించాయి. నిజానికి నయనతార కెరీర్ మొదటి నుంచి సూపర్ స్టార్ గా ఎదగడం స్పూర్తిదాయకంగా ఉన్నప్పటికీ, డాక్యుమెంటరీలోని ఆమె మ్యారేజ్ పార్ట్, వ్యక్తిగత ప్రయాణం అంత ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే శోభిత - నాగ చైతన్య కూడా నయనతార బాటలో నడిచారని మాట వినిపించింది. ఈ జంట తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ కు అత్యంత భారీ వరకు అమ్మేశారనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక నెట్ ఫ్లిక్స్ ఈ క్రేజీ కపుల్ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను 50 కోట్ల రూపాయలకు దక్కించుకుందని వార్తలు వచ్చాయి.