Thandel Movie Leaked : 'తండేల్' టీమ్‌కు షాకిచ్చిన లీకు రాయుళ్ళు - థియేటర్లలోకి వచ్చిన గంటల్లోనే మూవీ HD వెర్షన్ లీక్
Thandel Movie Leaked : నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'తండేల్' థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజుకే లీక్ అయ్యింది.

Thandel Gets Leaked In Online: అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్' భారీ అంచనాలతో శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలోకి వచ్చింది. కానీ మూవీ టాక్ ఎలా ఉంది అన్న విషయం కూడా ఇంకా పూర్తిగా బయటకు రాకముందే, పైరసీ బారిన పడి మేకర్స్‌కి షాక్ ఇచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఈ మూవీ పైరసీ సైట్లలో అందుబాటులో ఉండడం ఆందోళనకరంగా మారింది.
'తండేల్' మూవీ పైరసీ
ఫిబ్రవరి 7న 'తండేల్' మూవీ ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగు పెట్టింది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే మూవీని చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటుండగా, సినిమాలో నాగచైతన్య - సాయి పల్లవి నటన, డీఎస్పీ సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో చివరి 20 నిమిషాల సీన్స్ బాగున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ థియేటర్లలో అలా రిలీజ్ అయిందో లేదో గంటల వ్యవధిలోనే ఈ సినిమా పలు పైరసీ వెబ్సైట్లలో లీక్ అయ్యింది. ఫిల్మీ జిల్లాలో వంటి పైరసీ సైట్లలో 'తండేల్' మూవీ హెచ్డి క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండడం గమనార్హం.
లీకు రాయుళ్ళు ఇలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన గంటల్లోనే మూవీని పైరసీని చేస్తున్నప్పటికీ, నిర్మాతలు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ పైరసీ వల్ల మేకర్స్‌కు భారీ నష్టాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తూ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలోనే చూడడానికి ఆసక్తిని కనబరుస్తారు. మరి ఇలాంటి ఎదురు దెబ్బలను తట్టుకొని, 'తండేల్'మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందా అనేది చూడాలి. అంతేకాకుండా మేకర్స్ ఈ పైరసీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.
'విదాముయార్చి' కూడా లీక్
కేవలం 'తండేల్' మాత్రమే కాదు, నిన్ననే థియేటర్లలోకి వచ్చిన అజిత్ మూవీ 'విదాముయార్చి' కూడా పైరసీ సైట్లలో లీక్ అయ్యింది. అజిత్ కుమార్ నటించిన విదాముయార్చి ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇందులో త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం తమిళ్ రాకర్స్, ఫిల్మి జిల్లా, మూవీస్ వంటి వెబ్సైట్ లలో హెచ్డి క్వాలిటీని లీక్డ్ వెర్షన్ అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా "పైరసీకి నో చెప్పండి. విదాముయార్చి మూవీని థియేటర్లలోనే వీక్షించండి" అంటూ ప్రేక్షకులను కోరింది.
పైరసీ బారిన పడిన కొత్త సినిమాలు
తండేల్, విదాముయార్చి వంటి కొత్త సినిమాలు కంటే ముందు రిలీజ్ అయిన పలు సూపర్ హిట్ సినిమాలన్నీ ఇలాగే లీక్ అయ్యాయి. ఆ లిస్టులో గేమ్ ఛేంజర్, పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, రేఖా చిత్రమ్ వంటి ఇతర సినిమాలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

