Ranveer Singh: ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా బిడ్డ, ఆ సీన్ చేస్తున్నప్పుడు రణవీర్ అక్కడే ఉన్నాడు - నాగ్ అశ్విన్
Nag Ashwin: ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనె ఒక ప్రెగ్నెంట్ మహిళగా నటించింది. అయితే క్లైమాక్స్ షూట్ చేసే సమయానికి దీపికా నిజంగానే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మూవీ టీమ్ తాజాగా బయటపెట్టింది.
Nag Ashwin About Deepika Padukone: నటీనటులు ఒక సినిమాను సైన్ చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు వచ్చినా దానిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరు నటీనటులు మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురయినా డెడికేషన్‌తో పనిచేస్తారు. అలాంటి వారిలో దీపికా పదుకొనె కూడా ఒకరని ప్రశంసలు కురిపించాడు ‘కల్కి 2898 AD’ యాక్టర్ సస్వతా చాటర్జీ. సినిమా షూటింగ్ చాలాకాలం క్రితమే ప్రారంభమయ్యింది. ఈ మూవీని దాదాపు మూడేళ్ల క్రితం సైన్ చేసింది దీపికా పదుకొనె. షూటింగ్ చివరి దశకు చేరుకునే సమయానికి తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయినా తన డెడికేషన్ ఎలా ఉందో తాజాగా బయటపెట్టారు మూవీ టీమ్.
అప్పుడే షూటింగ్..
‘కల్కి 2898 AD’లో సుమతి అనే క్యారెక్టర్‌లో కనిపించింది దీపికా పదుకొనె. అందులో తను ఒక ప్రెగ్నెంట్ మహిళగా నటించింది. ఫిబ్రవరీలో తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసింది దీపికా. ఆ తర్వాత కూడా కొన్నిరోజుల పాటు ‘కల్కి 2898 AD’ షూటింగ్‌లో పాల్గొంది. అప్పటికీ సినిమా షూటింగ్ ఎండింగ్‌కు వచ్చింది. తాజాగా ఆ రోజులను గుర్తుచేసుకున్నారు నాగ్ అశ్విన్. ‘‘కొన్నిరోజులు దీపికా బిడ్డ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు’’ అని అన్నాడు. ఇక ఈ మూవీలో మిలిటరీ కమాండర్‌గా నటించిన సస్వతా చాటర్జీ కూడా దీపికాతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. రణవీర్ సింగ్ కూడా ‘కల్కి 2898 AD’ సెట్స్‌కు వచ్చాడని బయటపెట్టారు.
సెట్స్‌లో రణవీర్..
‘‘దీపికా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఈ సినిమాలో ఒక సీన్‌లో నేను తనను జుట్టు పట్టుకొని లాక్కెళ్లాలి. అప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సీన్ మేము ముంబాయ్‌లో షూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దీపికా అప్పటికే ప్రెగ్నెంట్‌గా ఉంది. అప్పుడే రణవీర్ సెట్స్‌కు వచ్చాడు. తన టీషర్ట్, ప్యాంట్స్, షూస్ అన్నీ ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి. రాగానే అందరికీ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాడు. తను ఒక్క చోటులో అస్సలు నిలబడడు. ఆరోజు దీపికా ఫిజికల్‌గా చాలా కష్టపడే సీన్స్ ఉన్నాయి. అందుకే కంగారుపడొద్దు, బాడీ డబుల్ ఉంది అని రణవీర్‌తో చెప్పాను. తను చాలా మర్యాదగా నాకు తెలుసు దాదా అన్నాడు’’ అని రణవీర్‌తో తన మీటింగ్ గురించి గుర్తుచేసుకున్నారు సస్వతా చాటర్జీ.
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే..
ప్రెగ్నెంట్ అయినా కూడా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగం ఎగైన్’లో కూడా ఆగకుండా వర్క్ చేసి షూటింగ్‌ను పూర్తి చేసింది దీపికా పదుకొనె. సెప్టెంబర్‌లో తమ బేబీకి వెల్కమ్ చెప్పనున్నారు రణవీర్ సింగ్, దీపికా. తను ‘కల్కి 2898 AD’ ఈవెంట్‌కు అటెండ్ అయ్యే ముందు వరకు కూడా సరోగసి ఆప్షన్‌ను ఎంచుకుందని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ ఈవెంట్‌లో బేబీ బంప్‌తో కనిపించేసరికి ఆ కామెంట్స్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే ‘కల్కి 2898 AD’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది దీపికా. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగం ఎగైన్’ కూడా నవంబర్‌లో విడుదల కానుంది.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు? అసలు విషయం చెప్పేసిన నాగ్ అశ్విన్