By: ABP Desam | Updated at : 12 Apr 2022 01:41 PM (IST)
నాని, నదియా
ఇన్నాళ్ళూ నదియా నటన చూశారు. ఇప్పుడు నదియా మాటలు వినడానికి తెలుగు ప్రేక్షకులు రెడీనా? తొలిసారి ఆమె తన గొంతు వినిపించడానికి సిద్ధమయ్యారు. అంటే తెలుగులో డబ్బింగ్ చెప్పారు. 'మిర్చి'లో ప్రభాస్‌కు తల్లిగా, 'అత్తారింటికి దారేది'లో పవన్ కల్యాణ్ అత్తగా నటించిన తర్వాత... తెలుగులో నదియా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు దర్శక - నిర్మాతలు ఆమె తలుపు తట్టడం ప్రారంభించారు.
తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా... ఇన్నాళ్ళూ తెలుగులో డబ్బింగ్ చెప్పుకోలేదు నదియా. తెరపై కనిపించేది నదియా అయితే, గొంతు వేరేవాళ్ళది. కానీ, ఇప్పుడు గొంతు కూడా ఆమెదే. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రూపొందుతోన్న 'అంటే సుందరానికి' సినిమాలో ఆమె ఓ రోల్ చేశారు. హీరోయిన్ నజ్రియా నజీమ్ తల్లిగా కనిపించనున్నారు. తన పాత్రను తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారు నదియా.
"చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. 'అంటే సుందరానికి' సినిమా కోసం! నాపై నమ్మకం ఉంచిన దర్శకుడు వివేక్ ఆత్రేయకు థాంక్స్" అని నదియా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Also Read: 'హైపర్' ఆది ఎక్కడ? 'జబర్దస్త్'లో ఎందుకు కనిపించడం లేదు?
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ సంగీత దర్శకుడు.
Also Read: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం
Chiranjeevi - Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల
Nandamuri Chaitanya Krishna: వెండితెరకు మరో నందమూరి వారసుడు, చైతన్య కృష్ణ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?
Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్
TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం