Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Pushpa 2 SS Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తాను ‘పుష్ప 2’పై పని చేస్తున్నట్లు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్తీక్ కాన్సర్ట్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
SS Thaman For Pushpa 2: ‘పుష్ప 2’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మీద ఎస్ఎస్ థమన్, అజనీష్ లోకనాథ్, శామ్ సీఎస్ పని చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ఎస్ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చారు. తాను ‘పుష్ప 2’ సినిమాపై పని చేస్తున్నానని తెలిపారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు కార్తీక్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కాన్సర్ట్‌కు ఎస్ఎస్ థమన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్తీక్‌తో మాట్లాడుతూ... ‘నాకోసం పుష్ప 2 వెయిటింగ్. నేను వెళ్లాలి బ్రదర్.’ అని చెప్పారు. అనంతరం ఆయన కాన్సర్ట్ నుంచి వెళ్లిపోయారు.
I have #Pushpa2 waiting for me 🫣🔥
— ⚓ AmruthVarsh ⚓ (@Dhoni_Varsh) November 9, 2024
the best every emergency help u are gonna do ❤️💪 #Pushpa2TheRule #Thaman pic.twitter.com/lqVFrxrtRk
ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు
‘పుష్ప 2’ సినిమా కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు ఎస్ఎస్ థమన్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్, తమిళ సంగీత దర్శకుడు శామ్ సీఎస్ కూడా ఈ సినిమాలో వేర్వేరు పోర్షన్లపై పని చేస్తున్నారని సమాచారం.
నవంబర్ 17న ట్రైలర్...
నవంబర్ 17వ తేదీన ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ కానుందని సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దేశంలోని ఏడు నగరాల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లు జరగనున్నాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాట్నా (బిహార్), కోల్‌కతా (వెస్ట్ బెంగాల్), చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), బెంగళూరు (కర్ణాటక), ముంబై (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ) నగరాల్లో ఈ ఈవెంట్లు జరగనున్నాయి.
పాట్నాలో జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రమోషన్లకు టీమ్ శ్రీకారం చుట్టనుంది. ట్రైలర్ 17వ తేదీన లాంచ్ అన్న విషయాన్ని టీమ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ 17వ తేదీన ఫిక్స్ అని మాత్రం వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
ట్రైలర్ అంత లెంతా?
‘పుష్ప 2’ ట్రైలర్ నిడివి మూడు నిమిషాల 45 సెకన్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య సినిమా కథ, స్కేల్ అన్నీ ట్రైలర్‌లో డిటైల్డ్‌గా చూపిస్తున్నారు. దీని వల్ల వాటి నిడివి పెరుగుతోంది. ‘సలార్’ మొదటి ట్రైలర్ నిడివి కూడా మూడు నిమిషాల 47 సెకన్ల వరకు ఉంది. ఇక ఇటీవలే వచ్చిన ‘సింగం అగైన్’ ట్రైలర్ నిడివి ఏకంగా నాలుగు నిమిషాల 45 సెకన్లుగా ఉంది.
రిలీజ్ ట్రైలర్ ఉంటుందా?
ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన పెద్ద సినిమాలు ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర: పార్ట్ 1’ సినిమాలకు రెండేసి ట్రైలర్లు విడుదల చేశారు. ఈ మూడు సినిమాలకు మొదటి ట్రైలర్లలో కథను చూపించి, రెండో ట్రైలర్‌ను గూస్‌బంప్స్‌తో నింపేశారు. మరి ‘పుష్ప 2’కి కూడా రిలీజ్ ట్రైలర్ ఏమైనా ఉంటుందేమో చూడాలి!
Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!