అన్వేషించండి

Manam Re Release: 'మనం' రీ రిలీజ్ - మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ బిజీ బిజీ!

Anup Rubens: 'మనం' రీ రిలీజ్ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన కీ బోర్డు మీద కంపోజ్ చేసిన ట్యూన్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ చూడండి.

Manam Movie Re Release News: అక్కినేని ఫ్యామిలీకి, ప్రేక్షకులకు 'మనం' వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. అక్కినేని నాగేశ్వర రావు, ఆయన తనయుడు కింగ్ నాగార్జున, మనవడు నాగ చైతన్య హీరోలుగా నటించడం దీని ప్రత్యేకత. ఇందులో అఖిల్ ఓ చిన్న అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలై ఇవాళ్టికి పదేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్లో స్పెషల్ షో వేశారు. 

'మనం' మ్యూజిక్ కూడా హిట్టే
'మనం' విజయంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం అందించిన ఆ సాంగ్స్ వింటుంటే ఇప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్, ఓ విధమైన హాయి కలుగుతుంది. అనూప్ రూబెన్స్ కీ బోర్డు మీద 'మనం' సాంగ్స్ ప్లే చేసిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ఆయన పేరు మార్మోగుతోంది. మరొక్కసారి ఆయన పాటల్ని గుర్తు చేసుకుంటున్నారు.

View this post on Instagram
 
A post shared by Annapurna Studios (@annapurnastudios)

అక్కినేని ఫ్యామిలీ, అనూప్ రూబెన్స్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాలకు ఆయన చార్ట్ బస్టర్ ఆల్బమ్స్, రీ రికార్డింగ్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'హార్ట్ ఎటాక్', 'టెంపర్' సినిమాలకూ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నితిన్ 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలతో పాటు ఆది సాయి కుమార్ 'ప్రేమ కావాలి', రానా దగ్గుబాటి 'నేనే రాజు నేనే మంత్రి', యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' వంటి హిట్ సినిమాలకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. అయితే, కొన్ని రోజులుగా ఆయన పేరు వినిపించడం లేదు. ఇప్పుడు 'మనం' రీ రిలీజుతో అనూప్ సాంగ్స్ వినడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఏయే సినిమాలు చేస్తున్నారో తెలుసా?

అనూప్ రూబెన్స్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమిటంటే?
Anup Rubens Upcoming Telugu Movies: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చేస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దాంతో పాటు మాస్ మహారాజా రవితేజ సోదరుని కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. దానికి గౌరీ రోణంకి దర్శకురాలు.

Also Readమలయాళ సినిమా టర్బో రివ్యూ: మమ్ముట్టి యాక్షన్ కామెడీ ఎలా ఉందంటే?

'సుబ్రహ్మణ్యపురం' విజయం తర్వాత కథానాయకుడు సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కలయికలో వస్తున్న 'వారాహి' సినిమాకు కూడా అనూప్ మ్యూజిక్ చేస్తున్నారు. ఆది సాయి కుమార్‌ హీరోగా వీరభద్రం చౌదరి తెరకెక్కిస్తున్న 'కృష్ణ ఫ్రమ్ బృందావనం', ఆకాష్ పూరి హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు ఆయన పని చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్. 2024 ఇయర్ ఎండ్, 2025లో ఆయన నుంచి మినిమమ్ డజను సినిమాలు రానున్నాయి.

Also Readమూడు రోజులు... రోజుకు ఐదు గంటలు... బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ కష్టం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Embed widget