అమితాబ్, అనుష్కశర్మపై ముంబై పోలీసులు సీరియస్
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, విరాట్ కొహ్లీ సతీమణి అనుష్కశర్మపై నెటిజన్లు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ రైడింగ్ సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని సోషల్ మీడియా ద్వారా కంప్లైంట్ చేశారు.
ఇటీవల విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై ఎక్కి వెళ్లిగా, బిగ్ బీ అమితాబచ్చన్ బైక్ పై షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సరికి.. నెటిజన్లు కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. అమితాబ్ బైక్ పై వెళ్తున్న వీడియోను చూసిన వారు.. బైక్ పై ఉన్న డ్రైవర్ కు, అమితాబ్ కు హెల్మెట్ లేదని ఆరోపించారు. ముంబై పోలీసులు గమనించండంటూ పలువురు ట్విట్టర్ లో ఫిర్యాదులు చేశారు. ఈ విషయంపై స్పందించిన ముంబై పోలీసులు.. ఈ విషయాన్ని ట్రాఫిక్ బ్రాంచ్ కు షేర్ చేశామని రిప్లై ఇచ్చారు. అదే తరహాలో ఇటీవల బాడీగార్డుతో బైక్ రైడ్ చేసిన అనుష్క శర్మ వీడియోపైనా నెట్టింట్లో పలు కంప్లైంట్లు వచ్చాయి. రైడర్స్ ఇద్దరికీ హెల్మెట్స్ లేవని ఆరోపణలు వచ్చాయి. దీనిక్కూడా ముంబై పోలీసులు స్పందిస్తూ... ట్రాఫిక్ బ్రాంచ్ కు షేర్ చేశామని అదే రిప్లైను ఇచ్చారు.
ఇటీవల ముంబై ట్రాఫిక్ లో చిక్కుకున్న అమితాబచ్చన్ కి బైక్ మీద వెళ్లే ఓ సాధారణ వ్యక్తి సహాయం చేశారు. అమితాబచ్చన్ ని ఏకంగా బైక్ మీద షూటింగ్ స్పాట్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో సరైన సమయానికి అమితాబచ్చన్ షూటింగ్ కి హాజరయ్యారు. ఈ విషయాన్ని షేర్ చేసిన అమితాబ్.. సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెప్పారు. 'నన్ను బైక్ మీద తీసుకెళ్లినందుకు చాలా థాంక్స్.. నన్ను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో తెలియదు, కానీ బైక్ పై నన్ను వేగంగా తీసుకెళ్లడంతో సరైన సమయానికి షూటింగ్ కి చేరుకున్నానంటూ ఆయన పోస్టులో తెలిపారు.
అనుష్క శర్మ కూడా కారును పక్కనపెట్టి తన బాడీ గార్డ్ బైక్‌పై ముంబై వీధుల్లో మే 15న చక్కర్లు కొడుతూ కనిపించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఈ వీడియోలో అనుష్కతో పాటు ఆమె బాడీగార్డ్ కూడా హెల్మెట్ ధరించలేదు. దీంతో అనుష్క శర్మ బైక్ రైడ్ వీడియోను నెటిజన్లు ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
అమితాబ్ ప్రస్తుతం దీపికా పదుకొణె, ప్రభాస్‌లు నటించిన ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాషా చిత్రం, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిభు దాస్‌గుప్తా కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం ‘సెక్షన్ 84’లోనూ అమితాబ్ నటించనున్నారు. దాంతో పాటు గణపత్‌లో కూడా ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు.
మరోవైపు అనుష్క చివరిసారిగా గత ఏడాది నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖలాలో అతిధి పాత్రలో కనిపించింది. ఆమె ఈ నెలలో కేన్స్‌లో అరంగేట్రం చేయనుంది. అనుష్క ఈ ఏడాది చివర్లో ‘చక్దా ఎక్స్‌ప్రెస్’తో సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు.