Mrunal Thakur: మృణాల్ సమాధానం చెప్పాల్సిందే - జెమినీ టీవీ డిమాండ్, స్పందించిన బ్యూటీ
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మృణాల్, జెమిటీ టీవీ మధ్యన జరిగిన సంభాషణ ఆసక్తి కలిగిస్తోంది.
Mrunal Thakur Responded To Gemini TV Demanded: ‘దసరా’ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా గత డిసెంబర్ 7న విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. తండ్రి, కూతురు సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. నానితో ఆమె కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ‘దసరా’ మూవీ తర్వాత అదే స్థాయిలో ఈ సినిమా కూడా సక్సెస్ అందుకుంది.
త్వరలో జెమినీ టీవీలో ప్రసారం
ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అదుర్స్ అనిపించిన ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కింది. ‘హాయ్ నాన్న’ సినిమా త్వరలో టీవీలో ప్రసారం కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసి దక్కించుకుంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 7 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. నిజానికి నాని నటించిన లేటెస్ట్ మూవీస్ శాటిలైట్ రైట్స్ అన్నీ జెమినీ టీవీ కొనుగోలు చేస్తోంది. ఈ సినిమా కంటే ముందు నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’ సినిమాల రైట్స్ ను జెమినీ టీవీ తీసుకుంది. తాజాగా ‘హాయ్ నాన్న’ శాటిలైట్ రైట్స్ కూడా కొనుగోలు చేసింది.
జెమినీ టీవీ డిమాండ్, స్పందించిన మృణాల్
రీసెంట్ ఈ సినిమాకు సంబంధించిన చిన్న ప్రోమోను జెమినీ టీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ కావాలంటే యష్ణ(మృణాల్)ను రిప్లై ఇవ్వమనండి” అంటూ క్యాప్షన్ పెట్టింది. తాజాగా ఈ పోస్టుకు మృణాల్ రెస్పాండ్ అయ్యింది. ‘అప్ డేట్ ఇవ్వండి ప్లీజ్” అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మృణాల్ తెలుగులో కామెంట్ పెట్టడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
‘హాయ్ నాన్న’ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా ఆడియో పాన్ ఇండియా రైట్స్ ను దిగ్గజ ఆడియో సంస్థ టీ సిరీస్ దక్కించుకుంది. మొత్తంగా అన్ని భాషాల్లో కలిపి ఈ ఆడియో రైట్స్‌కు రూ.9 కోట్ల వరకు ధర పలికిందని తెలుస్తోంది.
Read Also: అక్కడ మందు గ్లాస్, ఇక్కడ ప్లేట్ - ‘యానిమల్’ పాటకు అల్లు అర్హ క్యూట్ స్టెప్స్!