అన్వేషించండి

Jikki Lyrical Video Song : ‘మిస్టర్ బచ్చన్’ లిరికల్ సాంగ్ - రవితేజ, భాగ్యశ్రీ రొమాన్స్ చూస్తే.. లవ్‌లో పడిపోతారు!

ర‌వితేజ న‌టించిన సినిమా 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్'. ఈ సినిమాలో లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేసింది టీమ్. ర‌వితేజ చాలా డిఫ‌రెంట్ గా క‌నిపిస్తున్నాడు. హీరోయిన్ భాగ్య శ్రీ అంద‌రినీ అట్రాక్ట్ చేస్తుంది.

Mr Bachchan Movie Jikki Lyrical Video Song: ర‌వితేజ‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్'. ఆగ‌స్టు 15న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఇప్ప‌టికే సినిమా టీమ్ ముమ్మ‌రంగా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టింది. దాంట్లో భాగంగా ఒక్కో పాట‌ను రిలీజ్ చేస్తూ హైప్‌ను పెంచేస్తున్నారు. తాజాగా ర‌వితేజ‌, భాగ్య శ్రీ బొర్సేల రొమాంటిక్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ పాట‌లో ర‌వితేజ కొత్త లుక్ లో క‌నిపించాడు. ఇక భాగ్య‌శ్రీ త‌న అందాల‌తో, డ్యాన్స్ తో ఆకట్టుకుంది.

రొమాన్స్‌తో మైమరపించిన రవితేజ, భాగ్యశ్రీ

‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ సినిమా నుంచి రిలీజైన 'జిక్కీ' లిరిక‌ల్ పాట ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. రిలీజైన గంట‌లోనే పాట ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది. ఈ సాంగ్ చూసిన వాళ్లంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. పాట సూప‌ర్ అని, పాట డిఫ‌రెంట్ గా ఉందంటున్నారు. ఇక ఈ పాట‌కి మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించ‌గా, సింగర్స్ కార్తిక్, ర‌మ్య బెహ‌రా ఆలపించారు.

ఆక‌ట్టుకుంటున్న లిరిక్స్.. 

'జిక్కీ' పాట‌లో లిరిక్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. లిరిసిస్ట్ వ‌న‌మాలి ఈ పాట‌కు బాణీలు అందించారు. "అందంగా అల్లిక‌గా.. అల్లేసిందే న‌న్నే అల‌వోక‌.. 
ఓ ల‌ల‌న నీ వ‌ల‌న మోగిందేమో నాలో తిల్లానా.. నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్న‌దే గ‌ట్టిగానే కొట్టుకున్న‌దే.. ప‌ట్టుబ‌ట్టి పిల్ల చేయి ప‌ట్టుకున్న‌దే".. అంటూ అనే లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. ఇక ఈ పాటలో ర‌వితేజ హీరోయిన్‌ను పొగుడుతూ.. ఆమెను వెతుకుతున్న‌ట్లు క‌నిపించాడు. ఇక భాగ్యాశ్రీ తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. పాట‌లోని విజువ‌ల్స్ అన్నీ అద్భుతంగా, మ‌న‌సును హత్తుకొనేలా ఉన్నాయి.

ఆగ‌స్టు 15న రిలీజ్.. 

'ఈగల్', 'టైగర్ నాగేశ్వరరావు', 'రావణాసుర' లాంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ రుచి చూసిన తర్వాత మాస్ మహారాజా మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి ఈ మూవీ కీలకంగా మార‌నుంది అని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఆగ‌స్టు 15న లాంగ్ వీకెండ్ కావ‌డంతో ప్లాన్ గా సినిమాని రిలీజ్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టి సిరీస్ ఫిల్మ్స్, పనోరోమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'మిస్టర్ బచ్చన్' సినిమా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ 'రైడ్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. 

వెరైటీగా ప్ర‌మోష‌న్స్.. 

'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈసారి ఈ సినిమా ప్ర‌మోషన్స్ ని గ‌ట్టిగా ప్లాన్ చేశారు. హైద‌రాబాద్ మెట్రో ద్వారా కూడా సినిమా ప్ర‌చారం చేస్తున్నారు. హైద‌రాబాద్ మెట్రోలో మాస్ మహారాజా వాయిస్ ని ప్లే చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు స‌ర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. మెట్రోలో ర‌వితేజ వాయిస్ వ‌స్తున్న వీడియోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. భ‌లే ప్లాన్ చేశారు బాస్ అంటూ కామెంట్స్ పెడుతూ.. వీడియోలు షేర్ చేస్తున్నారు ఆయ‌న ఫ్యాన్స్, సినీ అభిమానులు. మ‌రి ఈ సారి ర‌వితేజ ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి మ‌రి. 

Also Read: ‘భారతీయుడు 2’ నిర్మాతలపై నష్టాల భారం - డబ్బు తిరిగిచ్చేయాలంటూ వారి డిమాండ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget