Mohan Lal: హేమ కమిటీ రిపోర్టు ఎఫెక్ట్ - తీవ్ర విమర్శలు, 'అమ్మా'కు మోహన్‌లాల్ రాజీనామా!
Mohan lal Resigns: హేమ కమిటీ రిపోర్టు మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ అంశంపై పృథ్వీరాజ్ సుకుమారన్ 'అమ్మా'పై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మోహన్‌లాన్ రాజీనామా చేశారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ షాకంగ్ నిర్ణయం తీసుకున్నారు. నటీనటుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన అమ్మాకు రాజీనామ చేశారు. ప్రస్తుతం ఆయన రాజీనామా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళ నటులపై లైంగిక వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కమిటీ నివేధించిన అంశాంలు ఇండస్ట్రీని కుదిపేస్తోతుంది. ఇతర ఇండస్ట్రీలు సైతం హేమ కమిటీ రిపోర్టుపై షాక్ అవుతున్నారు.
ఇక మలివుడ్‌లో ఇది తీవ్ర సంచలనంగా మారింది. నటీనటులంతా ఒక్కొక్కరుగా హేమ కమిటీపై స్పందిస్తున్నారు. అంతేకాదు నటీమణలంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపులపై నోరువిప్పుతూ నటులు, డైరెక్టర్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. హేమ కమిటీ రిపోర్టు బయటకు వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్దలంతా చక్కదిద్దే పనిలో పడ్డారు.
అంతేకాదు ఈ విషయంలో 'అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్'పై(AMMA) ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. మహిళల ఆర్టిస్టులకు రక్షణ ఇవ్వడంలో AMMA విఫలమైందని మండిపడుతున్నారు. ఇప్పటికే సలార్ నటుడు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హేమ కమిటీ నివేధికపై స్పందిస్తూ AMMAపై విమర్శలు గుప్పించారు. విషయంలో 'అమ్మా' పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు పలువురు నటీనటులు సైతం అమ్మాపై తీరుపై విమర్శలు చేస్తున్నారు.
ఈ తరుణంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో కమిటీ సభ్యులందరూ కూడా రాజీనామాలను సమర్పించారు. ఇక ఈ అంశమపై ఇప్పటికే సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేశారు. అలాగే నటుడు సిద్ధిక్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగాడు.
ఇదెలా ఉంటే హేమ కమిటీపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ.. హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని తానే అన్నారు. "ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం కల్పించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదికపై నాకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందే" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Also Read: ఆయన అలా అడగడంతో ఇబ్బంది పడ్డా - వెంటనే మమ్ముట్టి సర్‌కి ఫిర్యాదు చేశా - నటి అంజలి