Mitra Mandali: మరోసారి నవ్వులు పూయించనున్న ప్రియదర్శి - 'మిత్ర మండలి' ఫస్ట్ లుక్ అదుర్స్
Priyadarshi: ప్రియదర్శి మరో కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. బన్నీ వాస్ సమర్పణలో 'మిత్ర మండలి' మూవీలో నటిస్తుండగా.. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

Priyadarshi's Mitra Mandali First Look Released: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి మరోసారి నవ్వులు పూయించనున్నారు. టాప్ ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ సమర్పణలో 'బన్నీ వాస్ వర్క్స్' నిర్మాణ సంస్థలో ఓ కొత్త మూవీతో రాబోతున్నారు. ఇటీవలే ఈ మూవీకిి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది.
ముసుగులు తొలగిపోయాయి
ఫేసులకు మాస్కులతో ఇటీవల రిలీజ్ అయిన ప్రీ లుక్ అందరిలోనూ హైప్ క్రియేట్ చేసింది. నటీ నటులు ఎవరనే దానిపై సోషల్ మీడియాలోనూ చర్చ సాగింది. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
Also Read: 'స్పిరిట్' ఒక్కటే కాదు.. ప్రభాస్ 'కల్కి 2' నుంచి కూడా అవుట్? - కొంప ముంచుతున్న దీపికా డిమాండ్స్
ఇదిగో మీ 'మిత్ర మండలి'
ఈ చిత్రానికి 'మిత్ర మండలి' అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అందరి అంచనాలు పెంచేలా ఫస్ట్ లుక్ ఉంది. యాక్టర్స్‌ను పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా బన్నీ వాస్ ఓ వీడియో రిలీజ్ చేశారు. పోస్టర్‌లో నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్‌ను పరిచయం చేశారు. 'ముసుగులు తీసేశారు. ఇదిగో మీ మిత్ర మండలి. మీకు అపరిమిత వినోదాన్ని అందించేందుకు ఈ గ్యాంగ్ రెడీ అవుతోంది' అంటూ రాసుకొచ్చారు.
The masks are off, and here's the #MithraMandali that'll bring you a new Madness & Entertainment 👬👬👧
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025
Motion Poster: https://t.co/OXCGyZoSuC@BVWorksOffl @saptaaswamedia @VyraEnts #VijayendarS @PriyadarshiPN @JustNiharikaNm @smayurk @IamVishnuOi #PrasadBehra @Bhanu_pratapa… pic.twitter.com/EDdAKPuMSn
The masks are off, and here's the #MithraMandali that'll bring you a new Madness & Entertainment 👬👬👧 pic.twitter.com/nSx4HDzI1v
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025
ఈ మూవీలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీకి కొత్త దర్శకుడు ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచారు. ఆర్.ఆర్.ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'కోర్టు', 'సారంగపాణి జాతకం' వంటి వరుస హిట్లతో దూసుకెళ్తోన్న ప్రియదర్శి ఈ మూవీతోనూ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
ఈ మూవీని బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన 'బన్నీ వాస్ వర్క్స్' బ్యానర్‌పై సమర్పిస్తుండగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల మూవీని నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మూవీ టీం వెల్లడించనుంది.






















