Jayam Ravi Keneesha: దండలతో జయం రవి, సింగర్ కెనీషా ఫోటోలు - 'పెళ్లి చేసుకున్నారా?' అంటూ చర్చ.. ఆ వార్తల్లో నిజమెంత?
Ravi Mohan: కోలీవుడ్ హీరో జయం రవి, సింగర్ కెనీషా మరోసారి వార్తల్లో నిలిచారు. తన సొంత నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించే క్రమంలో ఇద్దరూ పువ్వుల దండలతో దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

Jayam Ravi Keneesha Photos In Temple Gone Viral: తన భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారం, సింగర్ కెనీషాతో రిలేషన్ షిప్ రూమర్స్‌తో ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచారు కోలీవుడ్ హీరో జయం రవి. తాజాగా.. మరోసారి సింగర్ కెనీషాతో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి.
అసలేం జరిగిందంటే?
హీరో జయం రవి తన సొంత నిర్మాణ సంస్థ 'రవి మోహన్ స్టూడియోస్' లోగోను గురువారం సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు. ఈ ప్రకటనకు ముందు ఆయన సింగర్ కెనీషాతో కలిసి చెన్నైలోని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దర్శనం అనంతరం అర్చకులతో తీసుకున్న ఫోటోలు వైరల్‌గా మారాయి.
పెళ్లి చేసుకున్నారా? అంటూ చర్చ..
జయం రవి, కెనీషా ఇద్దరూ మెడలో పువ్వుల దండలు, అర్చకులతో కలిసి కనిపించడం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ 'పెళ్లి చేసుకున్నారా? అంటూ పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. మరికొందరు పూజా కార్యక్రమాల్లో భాగంగానే ఇలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: 'స్పిరిట్' ఒక్కటే కాదు.. ప్రభాస్ 'కల్కి 2' నుంచి కూడా అవుట్? - కొంప ముంచుతున్న దీపికా డిమాండ్స్
ఇదీ అసలు స్టోరీ..
- హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తనను సంప్రదించకుండానే ఈ ప్రకటన చేశారంటూ ఆర్తి రవి ఆరోపించారు. విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు.
- అయితే, సింగర్ కెనీషాతో రిలేషన్ వల్లే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారంటూ అటు కోలీవుడ్ ఇటు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరూ కలిసి కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
- దీనిపై స్పందించిన ఆర్తి.. జయం రవిపై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. పిల్లలను పట్టించుకోరంటూ కామెంట్ చేశారు. తాము విడిపోవడానికి పవర్, మనీ కారణం కాదని.. మూడో వ్యక్తే కారణమని తెలిపారు. అతని కెరీర్ కోసం తన డ్రీమ్స్, మాస్టర్స్ డిగ్రీ త్యాగం చేశానంటూ చెప్పారు.
- ఈ క్రమంలో సింగర్ కెనీషా సైతం ఇండైరెక్ట్‌గా, జయం రవి నేరుగా స్పందించారు. తనకు కష్ట సమయంలో కెనీషా అండగా నిలిచారని.. ఆమెపై ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని అన్నారు.
- ఇటీవలే జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు డివోర్స్ కోసం హాజరు కాగా.. ఆమెతో వివాహ బంధాన్ని కొనసాగించలేనని జయం రవి కౌన్సిలింగ్‌లో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తన భర్త నుంచి తనకు నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12న విచారణ జరగనుంది.






















