అన్వేషించండి

Mithun Chakraborty: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన 'పద్మ భూషణ్' నటుడు - ఐసీయూలో చికిత్స

Mithun Chakraborty Hospitalized: 'పద్మ భూషన్‌' అవార్డు గ్రహిత, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఆస్వస్థకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయన అస్వస్థకు గురైనట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Mithun Chakraborty Hospitalized: 'పద్మ భూషన్‌' అవార్డు గ్రహిత, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఆస్వస్థకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయన అస్వస్థకు గురైనట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చాతి నొప్పి రావడంతో ఆయన వెంటనే కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త తెలిసి ఆయన ఫ్యాన్స్‌ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ ఉందని, ఉదయం 10:30 గంటలకు చాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుతప్రికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన ఆడ్మిట్‌ చేసుకుని ఐసీయూ తరలించి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేశాం. ప్రస్తుతం ఆయన న్యూరోమెడిసిన్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఉన్నారు" అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఏడాదికి గానూ జనవరి 25, 2024 కేంద్ర ప్రభుత్వం ‘పద్మ భూషణ్‌’ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్‌ చక్రవర్తి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు.

Also Read: ఒక వ్యక్తి కావాలని తాకి, తలపై కొట్టాడు - చెంపచెల్లుమనిపించి పోలీసులకు పట్టించా..

మిథున్‌ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా బాలీవుడ్‌లో 80, 90 దశకంలో మిథున్‌ చక్రవర్తి స్టార్‌ హీరోగా కొనసాగారు. తెలుగులో  వెంకటేష్‌ గోపాలా గోపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక హిందీలో 'అయాం ఏ డిస్కో డ్యాన్సర్‌' అంటూ ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన. బెంగాలీకి చెందిన మిథున్‌ ఆ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. చివరికిగా ఆయన కాబూలివాలా అనే చిత్రంలో కనిపించారు. బాలీవుడ్‌ సంచలన మూవీ 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'లో తనదైన నటనతో మిథున్‌ సత్తా చాటారు. బాలీవుడ్‌లో నటుడిగా తనకంటూ సొంత ఇమేజ్‌ సంపాదించుకున్న మిథున్‌ చక్రవర్తి.. రాజాకియాల్లోనూ రానిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. మొదట టీఎంసీ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ  నేపథ్యంలో ఈ ఏడాది పద్మ అవార్డుల్లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డును ప్రకటించింది.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget