Mithra Mandali Censor Review: 'మిత్ర మండలి' సెన్సార్ రివ్యూ - కామెడీ ఎంటర్‌టైనర్ ఆడియన్స్‌ను మెప్పిస్తుందా?
Mithra Mandali Censor Report: ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్ర మండలి' ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి కాగా... రివ్యూ ఎలా ఉందో చూస్తే...

Priyadarshi's Mithra Mandali Movie Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ ఎం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్ర మండలి'. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నెల 16న మూవీ రిలీజ్ కానుండగా... తాజాగా సెన్సార్ పూర్తైంది. మరి మూవీ రివ్యూ ఎలా ఉందో చూస్తే...
సెన్సార్ రివ్యూ
'మిత్ర మండలి'కి సెన్సార్ బోర్డు క్లీన్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా నవ్వుకునే సినిమా అని సెన్సార్ బోర్డు రివ్యూ ఇచ్చింది. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఆద్యంతం వినోదభరితంగా ఉందని... సమాజంలోని వ్యవస్థలపై సున్నితంగా విమర్శనాస్త్రాల్ని సంధించారని బోర్డు సభ్యులు తెలిపారు. 'మిత్ర మండలి'ని బడ్డీ కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే మంచి సెటైరికల్ మూవీగా తెరకెక్కించారని చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా అంటూ 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది.
ప్రియదర్శి, నిహారిక ట్రాక్... విష్ణు ఓయ్, ప్రసాద్ బెహర, రాగ్ మయూర్ కామెడీ హైలైట్ కానుందని తెలుస్తోంది. వీటికి స్పెషల్ అట్రాక్షన్‌గా వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్, సత్య పాత్రలు కనిపించబోతున్నాయి. ఇక స్పెషల్ సర్‌ప్రైజ్‌గా బ్రహ్మానందం కూడా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఫేమస్ డైలాగ్‌తో 'జంబర్ గింబర్ లాలా' అంటూ సాంగ్ రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది. పాటలో ఆయన తనదైన కామెడీ స్టెప్పులతో అలరించారు.
ట్రైలర్ నవ్వుల్
'మిత్ర మండలి' ట్రైలర్, టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నాయి. నలుగురు స్నేహితుల మధ్య అల్లరితో పాటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, సరదా తగాదాలు అన్నీ కలగలిపి మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్షనిస్ట్ కుమార్తెను ముగ్గురు అల్లరి కుర్రాళ్లు ప్రేమిస్తే ఏం జరిగింది? అనేదే స్టోరీ. పోలీస్ ఆఫీసర్‌గా వెన్నెల కిశోర్ కామెడీ, ప్రసాద్ బెహర కామెడీ పంచులు వేరే లెవల్‌లో ఉన్నాయి.
ఈ మూవీకి ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహించగా... ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎంలతోపాటు ప్రసాద్ బెహర, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. ఆర్ ఆర్ ధృవన్ మ్యూజిక్ అందిస్తుండగా... నిహారిక, విజయేంద్రలకు ఇదే ఫస్ట్ మూవీ. ఫేమస్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ న్యూ బ్యానర్ 'బన్నీ వాస్ వర్క్స్' సమర్పణలో... సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా మూవీని నిర్మించారు.
Also Read: రింగ్స్ చెప్తున్న ఎంగేజ్మెంట్ స్టోరీ - మొన్న విజయ్ దేవరకొండ... నేడు రష్మిక
Mithra Mandali Technicak Team: బ్యానర్ - సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ - బివి వర్క్స్ బ్యానర్, బన్నీ వాస్, నిర్మాతలు - కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప & డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, సహ నిర్మాత - సోమరాజు పెన్మెట్సా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - రాజీవ్ కుమార్ రామ, సంగీతం - ఆర్ఆర్ ధ్రువన్, సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ ఎస్జె, ఎడిటింగ్ - పీకేప్రొడక్షన్ డిజైన్ - గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్స్ - శిల్ప టంగుటూరు.






















