Vijay Deverakonda: 'రౌడీ జనార్ధన్'గా విజయ్ దేవరకొండ - కొత్త మూవీ ప్రారంభం... విలన్‌గా సీనియర్ హీరో
Rowdy Janardhana: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ న్యూ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నారు.

Vijay Deverakonda's Rowdy Janardhana Movie Started: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఆయన కొత్త మూవీ 'రౌడీ జనార్ధన' పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'రాజావారు రాణివారు' మూవీ ఫేం రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా... విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, అల్లు అరవింద్, మూవీ టీం హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రెండోసారి...
SVC బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించనున్నారు. 'ఫ్యామిలీ స్టార్' మూవీ తర్వాత దిల్ రాజ్, విజయ్ కాంబోలో వస్తోన్న రెండో మూవీ ఇది. ఇక గతేడాది కీర్తి సురేష్ వివాహం జరగ్గా... పెళ్లి తర్వాత ఆమె నటిస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ ఇదే. గతంలో 'మహానటి' మూవీ కోసం విజయ్, కీర్తి కలిసి పని చేశారు. ఈసారి విజయ్ సరసన హీరోయిన్‌గా నటించనున్నారు.
పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా... సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి ముంబయిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ సరసన కీర్తి నటిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
A Wild Beginning.. 🔥
— Sri Venkateswara Creations (@SVC_official) October 11, 2025
LOVE - RAGE - BLOOD ❤️🔥
The most anticipated @TheDeverakonda x @storytellerkola's #SVC59 has began today with an auspicious Pooja Ceremony.#VDKolaMassThaandavam Begins.. 💥@KeerthyOfficial #AnendCChandran@DinoShankar @PraveenRaja_Off @SVC_official pic.twitter.com/LkTb6lsliK
Also Read: సైకలాజికల్ థ్రిల్లర్ 'మంగళవారం' సీక్వెల్ అప్డేట్ - ఫ్రాంచైజీ ప్లానింగ్ వేరే లెవల్





















