By: ABP Desam | Updated at : 29 Apr 2023 09:01 PM (IST)
టీజర్‌లో నవీన్ పోలిశెట్టి, అనుష్క (Image: UV Creations)
అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఇందులో ఆమెకు జోడీగా యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకుడు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టీజర్ ఎలా ఉందంటే?
Miss Shetty MR Polishetty Teaser : ఈ టీజర్‌లో అనుష్క పేరు పొందిన షెఫ్‌గానూ, నవీన్ పోలిశెట్టిని స్ట్రగులింగ్ స్టాండప్ కమెడియన్‌గానూ చూడవచ్చు. అనుష్కకు పెళ్లి చేయడం తన తల్లికి (జయసుధ) అస్సలు ఇష్టం లేదు. అయితే అనుకోకుండా నవీన్ పోలిశెట్టి, అనుష్క కలవాల్సి వస్తుంది. వారి మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను ఈ టీజర్‌లో చూడవచ్చు. కానీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారా లేదా అన్న విషయం మాత్రం రివీల్ చేయకుండా టీజర్‌ను కట్ చేశారు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!
అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వాటి తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హిందీలో విడుదల చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం.
'భాగమతి' తర్వాత అనుష్క...
'జాతి రత్నాలు' తర్వాత నవీన్!
సుమారు ఐదేళ్ళ తర్వాత అనుష్క శెట్టి నుంచి థియేటర్లలోకి వస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'భాగమతి' తర్వాత అనుష్క 'నిశ్శబ్దం' సినిమా చేశారు. అయితే, ఆ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిస్టారికల్ సినిమా 'సైరా నరసింహా రెడ్డి'లో ఝాన్సీ లక్ష్మీ బాయి రోల్ చేశారు. అందువల్ల, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
మరో విశేషం ఏమిటంటే... 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కూడా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'యే. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
'జీ' చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
అనుష్క సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. అవును... 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' డిజిటల్ రైట్స్‌ను 'జీ' గ్రూప్ కొనుకోలు చేసింది. అనుష్క సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'భాగమతి' హిందీ, తమిళ వెర్షన్స్ 'జీ 5'లో ఉన్నాయి. 'సైజ్ జీరో' తెలుగు వెర్షన్ కూడా 'జీ 5'లో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఆమె నటించిన మరికొన్ని సినిమాలూ ఉన్నాయి. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్... యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ఇమేజ్... అన్నీ కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాపై క్రేజ్ పెంచాయి.
Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!
Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా
Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?
రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ