Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్!
అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో పాన్ ఇండియా స్టార్ ధనుష్ ఓ పాట పాడారు. పాపం, ఆ పాట పాడాలని హీరో నవీన్ పోలిశెట్టి చాలా ట్రై చేశారు.
![Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! Miss Shetty Mr Polishetty second Song Hathavidi crooned by Pan India Dhanush to be out on 31 May Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/27/8c579d55ef5e8f87c70a544cceca94981685195831972313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty Movie release date). ఇందులో తొలి పాటను ఆల్రెడీ విడుదల చేశారు. రెండో పాటను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్టార్ ధనుష్ ఆ పాటను పాడటం విశేషం.
హతవిధీ... ఏందిది?
మే 31న ధనుష్ పాట!
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కోసం రామ జోగయ్య శాస్త్రి రాసిన 'హతవిధీ... ఏందిది' పాటను ధనుష్ ఆలపించారు. మే 31న ఆ పాట విడుదల కానుంది. పాపం, ఆ పాటను పాడాలని సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి చాలా ట్రై చేశారు. ఈ మధ్య హీరోలే తమ సినిమాల్లో పాటలు పడుతున్నారని, తనకూ అవకాశం ఇవ్వాలని, రెండో పాటను తానే పాడుతున్నానని ఓ స్థాయిలో బిల్డప్ ఇచ్చాడు. స్టూడియోకి వెళ్లి సాంగ్ కూడా పాడాడు. చివరకు చూస్తే సాంగులో ధనుష్ వాయిస్ వినిపించింది.
నవీన్ పోలిశెట్టి ఎంత ట్రై చేసినా సరే... అతడికి అవకాశం ఇవ్వలేదు దర్శక నిర్మాతలు! ధనుష్ గొంతుకు ఓటు వేశారు. ''హతవిధీ... ఏందిదీ? ఊహలో లేనిదీ! బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనదీ'' అంటూ ఈ గీతం సాగుతుంది. 31న పాటతో పాటు ధనుష్ రికార్డింగ్ చేసిన విజువల్స్ కూడా విడుదల చేయనున్నారు. లిరికల్ వీడియోలో ఆయన విజువల్స్ ఉంటాయి.
నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు .పి దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.
Also Read : నిఖిల్‌తో రామ్ చరణ్ సినిమా - ఇక విప్లవం మొదలు
View this post on Instagram
'జీ' చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
అనుష్క సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. అవును... 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' డిజిటల్ రైట్స్‌ను 'జీ' గ్రూప్ కొనుకోలు చేసింది. సినిమా విడుదలైన కొన్ని రోజులకు 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ గ్రూప్ ఛానళ్లలో టెలికాస్ట్ చేస్తారు.
అనుష్క సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'భాగమతి' హిందీ, తమిళ వెర్షన్స్ 'జీ 5'లో ఉన్నాయి. 'సైజ్ జీరో' తెలుగు వెర్షన్ కూడా 'జీ 5'లో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఆమె నటించిన మరికొన్ని సినిమాలూ ఉన్నాయి. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్... యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ఇమేజ్... అన్నీ కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాపై క్రేజ్ పెంచాయి. అందుకని, విడుదల తేదీ ఖరారు కావడానికి ముందు డిజిటల్, శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ జీ తెలుగు తీసుకుంది.
Also Read : ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)