Lady Luck full video song: స్వీటీకి తన మనసులో మాట చెప్పేసిన నవీన్ పొలిశెట్టి - ‘లేడీ లక్’ ఫుల్ సాంగ్ ఇదిగో!
మహేశ్ బాబు దర్శకత్వంలో వస్తోన్న 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' లోని 'లేడీ లక్' పాట రిలీజ్ అయింది. ఈ పాట ద్వారా నవీన్.. అనుష్కపై ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె వచ్చిన తర్వాత తన లైఫ్ మారిపోయిందంటూ ఉంటాడు
Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 4, 2023న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా నుంచి మూడవ సింగిల్ గా 'లేడీ లక్' పాట రిలీజ్ అయింది. "ఎందుకంత ఇష్టం నేనంటే.. ఇందులోని గొప్ప నేను నీకంటే.. ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే" అంటూ ఈ పాట సాగుతోంది. రాధన్ స్వరపరిచిన ఈ బాణీకి రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Shastri) సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను కార్తీక్ అద్భుతంగా ఆలపించారు. హుషారైన బీట్ .. అందుకు తగిన కొరియోగ్రఫీ (Choreography) ఈ పాటలో ఆకట్టుకునే ఎలిమెంట్స్ గా చెప్పవచ్చు. అనుష్కను అభిమానిస్తూ.. ఆరాధిస్తూ.. ప్రేమిస్తూ, ఆమె రాకతో తన లైఫ్ మొత్తం మారిపోయిందని హీరో వ్యక్తం చేసే తన మనసులోని మాటనే ఈ పాట. దీన్ని బట్టి చూస్తే.. నవీన్, అనుష్కల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పాటకు కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ మ్యూజిక్ ప్రియులను అలరించనుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చాలా గ్యాప్ తరువాత అనుష్క చేసిన మూవీ కావడంతో ఈ చిత్రం రిలీజ్ కోసం ఆమె అభిమానులు మరింత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక మూడేళ్ల కిందట వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా(Jati Ratnalu) నవీన్ కెరీర్‌లోనే ఓ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. టాలీవుడ్(Tollywood)లో ఆయనకు ఈ సినిమా తిరుగులేని క్రేజ్‌ను, మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' కథ గురించి చెప్పాలంటే .. జీవితంలో పెళ్లి వద్దనుకునే అనుష్క(Anushka), నవీన్‌తో ఎలా ప్రేమలో పడింది? వాళ్ల ప్రేమ పెళ్ళి వరకు సాగుతుందా? స్టాండప్ కమెడియన్‌గా రాణించాలనుకునే నవీన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది లాంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవలే రిలీజైన టీజర్ కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది.
టీజర్ కు వస్తోన్న స్పందనను బట్టి చూస్తే చాలా కాలం తర్వాత మంచి లవ్ ఎంటర్‌టైనర్ సినిమా చూడబోతున్నాం అని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకోనున్నట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉండగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్-సౌత్ ప్రాజెక్ట్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.
Read Also : Guntur Kaaram: అమరావతికి అటు అమ్మ, ఇటు నాన్న- ‘గుంటూరు కారం’ అసలు కథ ఇదేనా?, ఆ టైటిల్ ఎందుకు మార్చారు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial