అన్వేషించండి

Indra Movie: "ఇంద్ర" సక్సెస్ సీక్రెట్ చెప్పిన చిరంజీవి- రీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల

Chiranjeevi: ఇంద్ర సినిమా రిలీజ్ టైంలో కలిగిన భావోద్వేగమే ఇప్పుడు ఉందంటున్న మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ రీ రిలీజ్‌ సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేశారు.

Chiranjeevi Birthday Special: ఆగస్టు 22 వచ్చిందంటే మెగా అభిమానులకు పండగ రోజు. చిరంజీవి పుట్టిన రోజు తమ సొంత ఇంట్లో మనిషి జన్మదినంగా జరుపుకుంటారు. అలాంటి పుట్టిన రోజుకు స్పెషల్ గిఫ్టుగా ఈసారి ఇంద్ర సినిమా రీరిలీజ్ అవుతుంది. అందుకే సంతోషం మరింత రెట్టింపు అయినట్టేనంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ సర్‌ప్రైజ్ వీడియో రిలీజ్ చేశారు. ఇంద్ర సినిమా గురించి మాట్లాడారు. 

ఇంద్ర సినిమాపై స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిరంజీవి... ఆ సినిమా రీరిలీజ్ చేస్తున్న టీంను అభినందించారు. తన ఫ్యాన్స్‌తోపాటు తనకూ మర్చిపోని గిఫ్టు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆ సినిమా విజయానికి కారణమైన విషయాలపై మాట్లాడారు. 

వీడియోలో చిరంజీవి ఏమన్నారంటే...." ఇంద్ర... ఇంద్రసేనా రెడ్డి... ఈ మాట వింటూంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. రోమాలు నిక్కబొడుకుంటున్నాయి.  అది పవర్ ఆఫ్‌ ఇంద్ర. అలాంటి పవర్‌ఫుల్‌ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన సినిమా. అంతటి ప్రజాదరణ పొందడానికి కారణం ఆ చిత్ర కథ. అలాగే ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో కష్టపడి శ్రద్ధాశక్తులతో పని చేశారు. మనసుపెట్టి ప్రాణం పోశారు. కాబట్టి ఇప్పటికీ ఆ చిత్రం గురించి, ఘన విజయం గురించి, ఆ చిత్రంలోనీ ఫ్రేమ్‌ల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏ సీన్‌ నుంచి మొదలు పెట్టినా సరే పూర్తిగా చూడందే అక్కడి నుంచి కదల్లేం. అలా ఉంటుంది ఆ కథలోని పట్టు బిగువు. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న, ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. కథా, స్క్రీన్‌ప్లే, డైలాగ్లు, ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్‌, ఎమోషనల్ సీన్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, సాంగ్స్‌, వాట్‌నాట్ ఎవ్రీథింగ్ అన్నీ పీక్స్‌లో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచం ఇంద్ర.

నిర్మాణ విలువలకు ఎంతో పేరు వచ్చిందంటే ప్రధాన కారణం వైజయంతీ మూవీస్‌, ఆ సంస్థ అధినేత, నా అభిమాన నిర్మాత అశ్వనీదత్‌. అయనతోపాటు కథను అందించిన చిన్ని కృష్ణ, డైలాగ్‌లు రాసిన పరుచూరి సోదరులు, అద్భుతమైన మ్యూజిక్ అందించిన స్వరబ్రహ్మ మణిశర్మ, డీపీవో వీఎస్‌ఆర్ స్వామి, ఎడిటర్‌ చంటీ, డ్యాన్స్, ఫైట్ మాస్టర్స్‌, నటీనటుల నటన, లాస్ట్ బట్‌నాట్ లీస్ట్‌ అందరినీ మించిన డైరెక్టర్ బీ గోపాల్‌ అత్యద్భుతంగా చెక్కి తెరకెక్కించి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమయ్యారు. వీళ్లందరికీ నా ధన్యావాదాలు.

22 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. 2002 జులై 24న ఎంత భావోద్వేగానికి గురయ్యానో ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది. నూతన జనరేషన్‌కు పెద్ద స్క్రీన్‌మీద చూపించాలన ఆలోచన వచ్చి పుట్టిన రోజు నాడు గిఫ్టుగా అందిస్తున్న స్వప్న దత్‌, ప్రియాంక దత్‌కి ప్రత్యేకించి నా అభినందనలు, చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్‌టైన్మెంట్‌ గ్యారంటీ " అని వీడియోలో చెప్పుకొచ్చారు.

Also Read: నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget