అన్వేషించండి

Devara: భీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పిన రామ్ - ‘దేవర’పై చరణ్ ఏం ట్వీట్ చేశారు?

Ram Charan Devara: మరికొన్ని గంటల్లో దేవర మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్పెషల్ ట్వీట్ చేస్తూ దేవర హిట్ కావాలని కోరుకున్నారు.

Ram Charan Wishes To Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' మరికొన్ని గంటలో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ హిట్ కావాలని కోరుకుంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తారక్ కు స్పెషల్ గా ట్వీట్ చేశారు. చెర్రీ స్పెషల్ ట్వీట్ లో ఏముందో చూద్దాం పదండి. 

దేవరకు చెర్రీ విషెస్ 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా 'దేవర'. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరపై అడుగు పెట్టబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మించగా, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 27న మూవీ భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లో 'దేవర' మాస్ ఫెస్ట్ థియేటర్లలో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ట్వీట్ చేస్తూ 'దేవర' మూవీ హిట్ కావాలని కోరుకున్నారు. ఈ మేరకు చెర్రీ "రేపు దేవర మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా నా బ్రదర్ తారక్ తో పాటు దేవర టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇద్దరు హీరోల మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. గతంలో వీరిద్దరూ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో చేసిన రామ్, భీమ్ పాత్రలను ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చెర్రీ, తారక్ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇద్దరూ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఆ మూవీ తర్వాత తారక్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కమిట్ అయ్యారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. 

Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే

చరణ్ ట్వీట్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదేనా... 
గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తర్వాత అందులో తారక్ పాత్ర తక్కువగా ఉందని, రామ్ చరణ్ పాత్రలో ఎక్కువ చేసి చూపించారంటూ ఇరువురు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకున్నారు. కానీ రేపు 'దేవర' రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చెర్రీ స్వయంగా తారక్ కు విష్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవ్వడమే కాకుండా చెర్రీకి థాంక్స్ చెబుతున్నారు. ఇక చెర్రీ చేసిన ట్వీట్ వల్ల కలిగే మరో ఉపయోగం ఏమిటంటే దేవర మూవీపై మెగా ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు చెర్రీ చేసిన సపోర్ట్ ను గుర్తు పెట్టుకొని మరీ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ హిట్ కావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడైతే 'దేవర' మూవీ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Also Readబ్లాక్ బస్టర్ కొడుతున్నాం... 'దేవర'కు సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన రివ్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget