Mega Family Movies: మెగాస్టార్ to పవర్ స్టార్ - నెల రోజుల వ్యవధిలో ఐదుగురు మెగా హీరోల సినిమాలు, ఫ్యాన్స్‌కు పండుగే!
ఈ ఏడాది మెగా ఇయర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదుగురు మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు..ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానున్నాయి.
Mega Heroes : ఈ ఏడాది మెగా అభిమానులకు మంచి ట్రీట్ ను అందించబోతోంది. మెగా ఫ్యామిలీ హీరోస్ సినిమాలన్నీ ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ చెప్పలేనంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఈ నలుగురి సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ అవుతున్నాయి.
మరికొన్ని రోజుల్లో బ్రో..
వినోదయ సీతమ్మకు రీమేక్ అయిన ‘బ్రో’ సినిమా ద్వారా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ఈ ఇద్దరు మెగా హీరోస్ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపిస్తుండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ భావిస్తునారు. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం.. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనుంది. ఈ సినిమాకు డైరెక్టర్ సముద్రఖని.
‘భోళా శంకర్’ డబ్బింగ్ కంప్లీట్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘భోళా’ శంకర్ చిత్రీకరణను కంప్లీట్ చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ఆగస్టు 11 న విడుదల కానుంది. అమెరికా వెళ్లే ముందు చిరంజీవి తన డబ్బింగ్ పనులను కూడా ముగించినట్టు రీసెంట్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సినిమా రూపొందే విధానం తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చారు. దాంతో పాటు ‘భోళా శంకర్’లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది.
‘గాండీవధారి..’తో వస్తోన్న వరుణ్ తేజ్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆగస్ట్ లో గాండీధారి అర్జునతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వలో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.
వైష్ణవ్ తేజ్ ఆదికేశవ..
తాజాగా ఆగస్టు రేసులో చేరాడు హీరో వైష్ణవ్ తేజ్. ఆయన కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న ఈ అదిరిపోయే యాక్షన్ ఫిల్మ్ 'PVT04'కి 'ఆదికేశవ' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ లాంఛనాలను పూర్తి చేసి ఆగస్ట్ 18న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ త్వరలోనే విడుదల చేయనున్నారు. పంజా వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌లోనే తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తుండటం విశేషం. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ఇలా ఐదుగురు మెగా హీరోలు తమ తమ సినిమాలతో నెల రోజుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇదే తొలిసారి.
Read Also : Krithi Shetty: బేబమ్మను వేధిస్తోన్న బడా హీరో కొడుకు - ఎట్టకేలకు స్పందించిన కృతి శెట్టి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial