అన్వేషించండి

Krithi Shetty: బేబమ్మను వేధిస్తోన్న బడా హీరో కొడుకు - ఎట్టకేలకు స్పందించిన కృతి శెట్టి

గత కొద్ది రోజుల నుంచి ఓ బడా హీరో కొడుకు నటి కృతి శెట్టి వెంట పడుతున్నాడని, స్నేహం చేయాలని ఆమెను ఇబ్బంది పెడుతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట్లో దీనిపై స్పందించని కృతి తాజాగా..

Krithi Shetty: సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు కొదవే ఉండదు. అయితే ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు పుకార్లను అంతగా పట్టించుకోరు. కొంతమంది మాత్రం వాటికి తమదైన శైలిలో స్పందిస్తూ సమాధానాలు చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో సెలబ్రెటీ గాసిప్స్ ఎక్కువైపోతున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరూ ఇది నిజం కాదు బాబోయ్ అంటూ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. తాజాగా టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి కూడా అలా వివరణ ఇచ్చింది. గత కొద్ది రోజుల నుంచి ఓ బడా హీరో కొడుకు కృతి శెట్టి వెంట పడుతున్నాడని, స్నేహం చేయాలని ఆమెను ఇబ్బంది పెడుతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట్లో దీనిపై స్పందించని కృతి ఈ వార్తలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆ మేటర్ పై తాజాగా వివరణ ఇచ్చింది. 

తప్పుడు కథనాలను వండి వార్చడం ఆపండి: కృతి శెట్టి

కృతి శెట్టి కెరీర్ ప్రస్తుతం ప్రశార్థకంగా మారింది. ఓ వైపు టాలీవుడ్ లో వరుస అపజయాలను చవిచూస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు రూమర్స్ రూపంలో మరో తలనొప్పి మొదలైంది. మొదట్లో లైట్ తీసుకున్నా.. ఈ పుకార్లు అంతకంతకూ పెరిగిపోతుండంతో స్పందించింది కృతి. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది. బడా హీరో కొడుకు వేధిస్తున్నాడంటూ తనపై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పంష్టం చేసింది. తానెప్పుడూ అలా చెప్పలేదని పేర్కొంది. వాస్తవానికి ఈ పుకార్లు పట్టించుకోకూడదని అనుకున్నానని, కానీ ఈ తప్పుడు ప్రచారం తీవ్ర స్థాయిలో జరగుతుండటంతో స్పందించాల్సి వచ్చిందని అంది. తనపై వస్తోన్న వార్తలన్నీ నిరాధారమైన వార్తలని, వాటిని ఎవరూ నమ్మవద్దని తేల్చి చెప్పింది. ఇలాంటి తప్పుడు కథనాలను వండి వార్చడం ఆపేయాలి అంటూ హితవు పలికింది. 

ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న బేబమ్మ

కెరీర్ ప్రారంభంలో వరుస హిట్ లతో దూసుకుపోయింది కృతి శెట్టి. ‘ఉప్పెన’,‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలు కృతి కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి. అయితే తర్వాత హీరో రామ్ తో ‘వారియర్’ సినిమాలో నటించింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. అక్కడ నుంచే టాలీవుడ్ లో కృతి ఫ్లాప్ ల పరంపర మొదలైంది. తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్టడీ’ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో టాలీవుడ్ కి పులిస్టాప్ పెట్టి ఇతర భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మలయాళంలో టొవినో థామస్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది కృతి. ‘కస్టడీ’ లాంటి బైలింగ్వుల్ మూవీతో ఇప్పటికే తమిళ ప్రేక్షకులకు పరిచయం అయింది. దీనితో పాటు ఇప్పుడు తమిళ్ స్టార్ నటుడు జయం రవి సినిమాలో చాన్స్ కొట్టేసింది బేబమ్మ. ఇటీవలే ఈ సినిమా లంఛనంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం కృతి ఆశలు అన్నీ ఈ సినిమాల మీదే ఉన్నాయి. తమిళ్, మలయాళం లో హిట్ అందుకుంటేనే మళ్లీ టాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలతో అయినా బేబమ్మ ఫేట్ మారుతుందో లేదో చూడాలి. 

Also Read: నేను సినిమా చూశాకే ప్రమోషన్స్ చేస్తా, అవన్నీ వృత్తిలో భాగమే: ‘రంగబలి’పై నాగశౌర్య 

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget