అన్వేషించండి

Mega 156 Title Glimpse: మెగాస్టార్‌ - వశిష్ట సినిమా టైటిల్‌ ఇదే - కళ్లు చెదిరేలా టైటిల్ గ్లింప్స్‌ వీడియో

Mega 156 Title Glimpse: మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. సంక్రాంతికి పండుగ కానుకగా మెగా 156 టైటిల్‌ను ప్రకటించింది మూవీ టీం.

Viswambhara: మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. సంక్రాంతికి పండుగ కానుకగా మెగా 156 టైటిల్‌ను ప్రకటించింది మూవీ టీం. ఈ మేరకు స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. కాగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేం వశిష్ట దర్శకత్వంతో క్రేజీ ప్రాజెక్ట్‌గా మెగా 156 మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబో అధికారిక ప్రకటన వచ్చినప్పటికి టైటిల్‌పై సస్పెన్స్‌ నెలకొంది. ఈ మూవీ టైటిల్‌కి సంబంధించి తరచూ సోషల్‌ మీడియా చర్చ జరుగుతుంది. మెగా 156 టైటిల్‌ ఇదేనంటూ పలు పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు 'విశ్వంభర' (Viswambhara) టైటిల్‌ను ఖారారు చేస్తూ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేకర్స్‌. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ షురూ చేశారు మేకర్స్. సోషియో ఫాంటసీ చిత్రంగా ‘మెగా 156’ తెరకెక్కుతుందని చెప్పడంతో ఆడియెన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విజేతలు ఎంఎం కీరవాణి సంగీతం అదిస్తుండగా, చంద్రబోస్ పాటు రాస్తున్నారు. కాగా ‘వాల్తేరు వీరయ్య’తో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు.. ఆ తర్వాత ‘బోళాశంకర్’తో వచ్చాడు. ఈ సినిమా చిరుకు గట్టి దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ విడులైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ఊహించని విధంగా వశిష్టతో సినిమాను అనౌన్స్‌ చేసి ఫ్యాన్స్‌లో క్యూరియాసిటి పెంచాడు మెగాస్టార్‌. 

నెటిజన్లు ఊహించిందే.. 

మెగాస్టార్‌ ఫస్ట్‌ పాన్‌ ఇండియా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి బింబిసార డైరెక్టర్‌ వశిష్ట పనితనమే అని చెప్పాలి. తొలి ప్రయత్నంలోనే'బింబిసార' వంటి విధ్యమైన కథ ఎంచుకుని నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ను డైరెక్ట్‌ సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ మూవీతోనే బ్లాకబస్టర్‌ హిట్‌ కొట్టి అందరిని దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా మెగాస్టారను మెప్పించి మరో సోషియా ఫాంటసితో రెడీ అయ్యాడు. జస్ట్‌ అనౌన్స్‌మెంట్‌తొ హైప్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి తరచూ సోషల్‌ మీడియాలో రకరకాలు పుకార్లు వినిపించాయి. మెగా 156కు ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నారంటూ తరచూ ఏదోక వార్త ప్రచారంలో ఉండేది. వాటిలో విశ్వంభర పేరు కూడా వినిపించింది. నెటిజన్లు ముందుగా ఊహించిన ఇదే టైటిల్‌ను ఫైనల్‌ చేస్తూ మేకర్స్‌ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లను కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.  

Also Read: ఈ ఓటీటీలోకే 'పుష్ప 2', 'దేవర' - స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రుముఖ సంస్థ

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? సోమవారం ఎన్ని కోట్లు వచ్చాయంటే? 
Chennai Love Story Four Days Collection - చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు... నాలుగో రోజు ఎంత వచ్చిందంటే?
Pavala Shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget