(Source: ECI/ABP News/ABP Majha)
Perni Nani : నిన్న నాగార్జున.. ఇవాళ దిల్ రాజు బృందం ! ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చర్చలే చర్చలు !
గురువారం నాగార్జున సీఎం జగన్‌తో సమావేశం కాగా ఈ రోజు దిల్ రాజు బృందం మంత్రి పేర్ని నానిని కలిశారు. టిక్కెట్ రేట్లు సహా అనేక సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు అన్ని కీలక ప్రయత్నాలూ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు బాక్సులు రెడీ అయ్యాయి. కానీ ఏపీలో టిక్కెట్ రేట్ల దగ్గర్నుంచి అనేక సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం అయితే విడుదల చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఆ సమస్యలు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. దీంతో సమస్య పరిష్కారం కోసం సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో దిల్ రాజు నేతృత్వంలోని బృందం ఏపీ సమచార మంత్రి పేర్ని నానితో రెండు సార్లు సమావేశం అయింది. అనూహ్యం శుక్రవారం మరోసారి వారు అమరావతికి వచ్చారు. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు.
Also Read : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీపెద్దల ఎమర్జెన్సీ మీటింగ్... ఏం చర్చించారంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత సమాచారం అడిగిందని ఇచ్చామని దిల్ రాజు తెలిపారు. గురువారమే టాలీవుడ్ హీరో నాగార్జన ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఆయన టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు వచ్చారని చెప్పలేదు. జగన్‌ను చూసి చాలా కాలం అయిందని అందుకే చూసేందుకు వచ్చానని చెప్పారు. నాగార్జున వచ్చి వెళ్లిన తర్వాత దిల్ రాజు నేతృత్వంలోని బృందం రావడంతో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని భావిస్తున్నారు.
Also Read : "టాలీవుడ్ బాస్ " పాత్రకు చిరంజీవి న్యాయం చేయలేకపోతున్నారా..!?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం గురువారమే టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో అమ్మాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే ఏపీలో సినిమా టిక్కెట్లన్నీ ప్రభుత్వ పోర్టల్ ద్వారానే అమ్మాల్సి ఉంటుంది. అయితే ఈ విధానానికి సినీ పెద్దలు అంగీకారం తెలిపారని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో టాలీవుడ్‌కు అతి పెద్ద సమస్యగా ఉన్నది టిక్కెట్ రేట్లు. వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ప్రభుత్వం అనూహ్యంగా టిక్కెట్ రేట్లను తగ్గించేసింది. ఆ టిక్కెట్ రేట్లతో ధియేటర్లు నడపలేమని.. రేట్లు పెంచాలని కోరుతున్నారు.
Also Read : రాష్ట్రపతి అభ్యర్థిగా రతన్ టాటాను ప్రతిపాదించిన నాగబాబు..! మరి మీరేమంటారు..?
అలాగే పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు బెనిఫిట్ షోలు ప్రదర్శించే అవకాశం ఇవ్వడం, టిక్కెట్ రేట్లను రెండు వారాల పాటు పెంచుకోవడం , ధియేటర్లకు విద్యుత్ రాయితీలు ఇవ్వడం వంటి అనేక సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. వాటి కోసం ఎడతెరిపి లేకుండా చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. గురువారం నాగార్జునతో పాటు జగన్‌తో విందు భేటీలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి అనే నిర్మాత .. చిరంజీవితో ఆచార్య నిర్మించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ నిరంజన్ రెడ్డి జగన్ లాయర్ కూడా !. అందుకే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు.
Also Read : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !